మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా..? బాలకృష్ణ
By తోట వంశీ కుమార్ Published on 28 May 2020 7:20 PM ISTకరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్-4లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభం కావాలన్నదానిపై తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి నేతృత్వంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు భేటి అయ్యారు. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి తెరతీస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తనకు తెలియదని, పేపర్లతో చూసి మాత్రమే తెలుసుకున్నానని అన్నారు. వారందరూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. మా అధ్యక్షుడు నరేష్ కూడా తనను పిలవడం లేదనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించడానికి ఆసక్తి కనబరచలేదు.
షూటింగ్‌లు మళ్లీ ప్రారంభించే అంశంపై యాక్టివ్‌గా సంప్రదిస్తున్న వారితోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. కావాలంటే అందరితో మాట్లాడతానన్నారు. నిర్మాతల మండలి బాలకృష్ణకు కూడాచెప్పాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు విధి విధానాలను తయారు చేశాం. షూటింగ్‌లు పునర్ ప్రారంభంపై చర్చలు జరిగాయని, 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన అంశాలను కూలంకషంగా మాట్లాడుకున్నామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, షూటింగ్‌లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలనే దానిపై చర్చిస్తామన్నారు. పోస్టు ప్రోడక్షన్ పనులకు ఇబ్బందులు లేవు కాబట్టి ఇప్పటికే వాటికి అనుమతులు ఇచ్చామని, ఇప్పుడప్పుడే థియేటర్లు తెలిచే పరిస్థితులు లేవన్నారు. ముఖ్యమంత్రితో బాలకృష్ణ మాట్లాడరని తెలిసింది.. ఆయనేమన్నారో చూసిన తర్వాతే స్పందిస్తామన్నారు. అయితే.. ఆ విజువల్స్ ఇప్పటివి కాదని కొందరు అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుని తరువాత మాట్లాడతానని అన్నారు.