మంచి మ‌న‌సు చాటుకున్న‌ బాలయ్య.. హైదరాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు భారీ విరాళం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2020 1:37 PM GMT
మంచి మ‌న‌సు చాటుకున్న‌ బాలయ్య.. హైదరాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు భారీ విరాళం

ప్రజలకు కష్టమొచ్చిందంటే చాలు ఆదుకోడానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ముందుంటారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరం భారీ వర్షాలను చవి చూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని ఆదుకోడానికి నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చారు. వరద బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ.1.50 కోట్ల విరాళం ప్రకటించారు. అంతేకాదు, బసవతారకరామ సేవా సమితి నేతృత్వంలో పాతబస్తీ వాసులకు ఆహారం అందించారు. సుమారు 1000 కుటుంబాలకు బిర్యానీ పంపించారు.

ముంపు ప్రాంతాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 13 నుంచి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయని పేర్కొన్నారు. నిన్న సాయంత్రమే దాదాపు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని 2100 కుటుంబాలను ఖాళీ చేయించామని తెలిపారు. నగర వ్యాప్తంగా 35,309 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయని, బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.2,800 విలువైన వస్తువులను అందజేస్తున్నామన్నారు.

Next Story