కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌..

By అంజి  Published on  18 March 2020 7:08 AM GMT
కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌..

ముఖ్యాంశాలు

  • 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్‌రెడ్డి
  • మొదట బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన కూకట్ పల్లి కోర్ట్
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి డ్రోన్‌ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇవాళ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. గత 14 రోజులుగా రేవంత్‌రెడ్డి చర్లపల్లి జైలులోనే ఉన్నారు. మొదటగా కూకట్‌పల్లి కోర్టు రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

Also Read: కరోనా మృతదేహాల ఖననం.. కేంద్రం మార్గదర్శకాలు

జన్వాడలోని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ కెమెరా ఎగరవేసిన కేసులో ఏ-1 నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి ఉన్నారు. కాగా ఈ కేసులో రేవంత్‌రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ నెల 6న రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో 8 మందిని నిందితులుగా అనుమానిస్తూ నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ వాడినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌విత్‌ 5ఏ, ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.

Also Read: విడాకులు కోరిన నిర్భయ దోషి భార్య..

రేవంత్‌రెడ్డి తన బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డ్రోన్‌ కెమెరా కేసులో బెయిల్‌ కోసం ఆయన కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్‌ పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాల్సిఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటీషన్‌ దాఖలు చేశారు. కాగా ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. రేవంత్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Next Story