తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ త‌లుపులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 May 2020 9:54 AM IST
తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ త‌లుపులు

హిందువుల‌ పవిత్ర పుణ్య‌క్షేత్రం బద్రీనాథ్ ఆలయ తలుపులు నేడు తెరుచుకున్నాయి. అర్చకులు, పండితుల వేద‌, మంత్రోచ్ఛరణల న‌డుమ తెల్ల‌వారుజామున 4:30 గంటలకు బ‌ద్రీనాథ్‌ని ఆలయం తెరుచుకుంది. దీంతో ఆలయ పరిసర ప్రాంగణాన్ని పూల‌తో చూడముచ్చటగా అలంకరించారు. ప్రధాన అర్చకులు సహా మొత్తం 28 మంది.. ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్నట్టు స‌మాచారం.

ఇదిలావుంటే.. ముందుగా.. ఆల‌యాన్ని ఏప్రిల్ 30న తెరవాలని భావించినా.. క‌రోనా విస్తృతి కార‌ణంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేపథ్యంలో రెండు వారాలపాటు వాయిదా వేశారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం.. ఉత్తరాఖండ్‌లోని నర, నారాయణ పర్వతాల మధ్య అలకనందా నది ఎడమవైపు తీరంలో కొలువై ఉంది. ఇక్కడి ప‌కృతి అందాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ఇక గతేడాది ఆలయ త‌లుపులు తెరిచిన మొద‌టిరోజే ప‌విత్ర‌ బద్రీనాథుని 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

Next Story