కోవిద్-19 కేసుల విషయంలో ప్రభుత్వం దగ్గర ఉంది సరైన డేటాయేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 May 2020 3:17 AM GMT
కోవిద్-19 కేసుల విషయంలో ప్రభుత్వం దగ్గర ఉంది సరైన డేటాయేనా..?

కేంద్ర ప్రభుత్వం కరోనా రోగులకు సంబంధించిన లెక్కల కోసం ఉపయోగిస్తున్న డేటాబేస్ లో చాలా తప్పులు ఉన్నాయని ఆర్టికల్ 14 చెబుతోంది. భారత ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్(ఐసిఎంఆర్) కు చెందిన డేటా బేస్ ను ఉపయోస్తోంది. కానీ ఆర్టికల్ 14 దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం ఇందులో చాలా తప్పులు ఉన్నట్లు చెబుతోంది.

మొదటి కోవిద్ కేసును భారత ప్రభుత్వం ప్రకటించిన 107 రోజుల తర్వాత మే 14, 2020 నాటికి 78000 పైగా కేసులు నమోదయ్యాయి. ఐసిఎంఆర్ డేటాబేస్ ను ప్రస్తుతం ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఐసిఎంఆర్ డేటాబేస్ లో చాలా తప్పులు ఉన్నాయని.. పేర్లు, డేటా విషయంలో చాలా తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఐసిఎంఆర్ డేటా ప్రకారం ఏప్రిల్ 29 నాటికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్.సి.డి.సి.) డేటాబేస్ కు ఐసిఎంఆర్ డేటాబేస్ కు 5024 పాజిటివ్ కేస్ ల తేడా ఉంది. ఎన్.సి.డి.సి. ని పలు రాష్ట్రాలు ఉపయోగిస్తూ ఉన్నాయి. రెండు డేటా బేస్ లలో సరైన లెక్కలు కేవలం అయిదు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే చూపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన డేటాలో కొన్ని ఎక్కువ కేసులు చూపించడం.. లేదా తక్కువ కేసులు చూపిస్తూ వచ్చాయి. రాష్ట్రాలు ఫిర్యాదులు చేయడంతో డేటా విషయంలో కొన్ని మార్పులు చేస్తూ వస్తున్నారు. కేంద్రం మాత్రం ఐసిఎంఆర్ డేటాను మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది.

Advertisement

ఏప్రిల్ 29న ఐసిఎంఆర్ కేంద్రానికి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పంపింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 33014 రికార్డులను మూడు రోజుల్లో పరిశీలించాలని, అలాగే డేటా బేస్ లో ఉన్న తప్పులను కూడా తెలియజేయాలని చెప్పుకొచ్చింది. మొత్తం 739జిల్లాలకు సంబంధించిన డేటాను పరిశీలించాలని కోరారు.

ఐసిఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సూచన ఇదే 'మే 2, సాయంత్రం ఆరు గంటల లోపు పేషెంట్స్ కు సంబంధించిన డేటా మొత్తాన్ని సేకరించాలని.. వెంటనే డేటాలో ఉన్న తప్పులను సరిజేయాలి' అని కోరింది. ఐసిఎంఆర్ రాష్ట్రప్రభుత్వాలతో మాట్లాడుతూ 33014 కేసులను సంబంధించిన డేటాను పూర్తిగా చూసి.. డూప్లికేట్ ఎంట్రీలను తీసి వేయాలని కోరారు.

Advertisement

ఫిబ్రవరి నెలలో కేంద్రప్రభుత్వం కోవిద్-19పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో ఐసిఎంఆర్ డేటా బేస్ ను పరిగణలోకి తీసుకుని మహమ్మారితో పోరాడాలని భావించారు. అలాగే లాక్ డౌన్ ను ఏయే ప్రాంతాల్లో ఎత్తివేయాలన్న దానిపై కూడా పలు సూచనలు చేశారు.

కానీ ఐసిఎంఆర్ డేటా బేస్ అన్నది మే 1 నాటికి కూడా ఆమోదయోగ్యమైనది కాలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం రెండో సారి లాక్ డౌన్ ను మే 17 వరకూ పొడిగించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రెజెంటేషన్స్ ను చూసి మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది.

మర్చి, ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలు, డేటాలను పరిగణలోకి తీసుకున్న ఆర్టికల్ 14.. ఐసిఎంఆర్ సరైన స్టాండర్డ్స్, ప్రోటోకాల్స్, ప్రక్రియలు, పద్ధతులు కనీసం పాటించలేదని తెలుసుకుంది. ఐసిఎంఆర్ చేష్టల కారణంగా ఫ్రంట్ లైన్ స్టాఫ్ మీద పని భారం పెరగడమే కాకుండా అధికారులను కంగారు పెట్టిస్తోంది.

తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుండి రిటైర్ అయిన కె.కొలందస్వామి మాట్లాడుతూ 'మార్గదర్శకాలు వస్తుంటాయి.. మారుతూ ఉంటాయని' అన్నారు. అలాగే వివరణలలో కూడా మార్పులు చూడవచ్చని ఆయన తెలిపారు. మే 3 వ తేదీన ఓ అధికారి మాట్లాడుతూ ఐసిఎంఆర్ డేటా బేస్ లో డూప్లికేట్ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రెస్ లు తప్పుగా చూపించబడ్డాయని అన్నారు. ఒక వ్యక్తిని ఓ జిల్లాలో టెస్టు చేస్తే.. లిస్టు మరో జిల్లాలో వస్తోందని.. ఇంతకూ ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలుసుకోడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. కాబట్టి ఐసిఎంఆర్ డేటాలో చాలా తప్పులే ఉన్నట్లు మనకు తెలుస్తోందని మరో అధికారి అన్నారు. రాష్ట్ర, జిల్లా అధికారుల సలహాలతో మార్పులు తీసుకుని వస్తే బాగుణ్ణు అని ఆయన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

రెండు డేటా బేస్ లలో ఉన్న వ్యత్యాసాల గురించి హెల్త్ మినిస్టర్ హర్ష్ వర్ధన్, హెల్త్ సెక్రెటరీ ప్రీతి సుడాన్, ఐసిఎంఆర్ జెనరల్ బలరాం భార్గవ, ఐసిఎంఆర్ రామన్ గంగఖేడ్కర్ లను వివరణ కోరుతూ ఆర్టికల్ 14 ఈమెయిల్స్ ను పంపింది.

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యు.) సెక్రెటరీ ఈ ఈమెయిల్స్ ను మినిస్ట్రీలో ఉన్న ఇతరులకు ఫార్వర్డ్ చేశారు. భార్గవ రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యు. దృష్టికి తీసుకుని వెళ్ళాలో కానీ ఐసిఎంఆర్ కు కాదని అన్నారు. భార్గవ ప్రత్యేకంగా ఎలాంటి మెసేజీ కూడా పెట్టలేదు.

1 Copy

ఈ రెండు డేటా బేస్ లు ఏంటి..?

జనవరి నెలలో నుండి ఐసిఎంఆర్ ఈ డేటా బేస్ ను తయారుచేస్తూ వస్తోంది. ఇండియా హెల్త్ మినిస్ట్రీలో భాగమైన ఎన్.సి.డి.సి. ఇలాంటి వైరస్ లు వచ్చిన సమయాల్లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రామ్(ఐ.డి.ఎస్.పి.) ను అమలు చేస్తూ ఉంటుంది. గ్రామాలు, పట్టణ ప్రాంతాలు,జిల్లా, రాష్ట్రాల లోని ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, అధికారుల నుండి తీసుకున్న సమాచారాన్ని డేటాలో పొందుపరుస్తారు. రాష్ట్రాలు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సమాచారం కోసం ఐ.డి.ఎస్.పి. డేటా బేస్ ను నమ్ముకుంటాయి.

కరోనా వైరస్ ప్రబలిన సమయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఐసిఎంఆర్ డేటా వైపు మొగ్గు చూపింది. లేబొరేటరీల నుండి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఐసిఎంఆర్ తన డేటాను రూపొందిస్తూ వస్తోంది. లేబొరేటరీలు పాజిటివ్ కేసుల సమాచారాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సి ఉంటుంది.

ఎన్.సి.డి.సి. మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో తనకు ఉన్న ప్రభుత్వ అధికారుల నుండి సమాచారాన్ని సేకరిస్తోంది. ఐ.డి.ఎస్.పి. నెట్వర్క్ ప్రతి జిల్లాలోనూ ఉందని.. ఈ నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని పక్కాగా తెలుసుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఐ.డి.ఎస్.పి. నెట్ వర్క్ లో చాలా తక్కువ స్టాఫ్ ఉంది. కీలక పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 7, 2020న ఐసిఎంఆర్ రాష్ట్రప్రభుత్వాలతో మాట్లాడుతూ ఐ.డి.ఎస్.పి. లోని ఖాళీలను పూరించాల్సిందిగా కోరింది. దీని నుండి వచ్చే డేటాను ఫస్ట్ హ్యాండ్ డేటాగా పరిగణించవచ్చు. లేబొరేటరీల నుండి వచ్చే డేటాను దాదాపుగా సెకండ్ హ్యాండ్ డేటాగా చెప్పుకోవచ్చు. ఈ రెండు డేటా బేస్ లు ఒకటే రకమైన ఫలితాలు ఇవ్వడంలో ఇప్పటి వరకూ రాజీ పడలేదు.

ఉదాహరణకు ఏప్రిల్ 29న త్రిపురకు సంబంధించి ఐసిఎంఆర్ డేటా ప్రకారం ఎన్.సి.డి.సి. డేటా కంటే 88 శాతం ఎక్కువ కేసులు నమోదైనట్లు డేటాలో తేలింది. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎన్.సి.డి.సి. డేటాకు, ఐ.సి.ఎం.ఆర్. డేటాకు చాలా తేడాలు గమనించవచ్చు. కేవలం అయిదు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలితప్రాంతాల్లో మాత్రమే రెండూ ఒకటే సమాచారాన్ని చూపించగలిగాయి.

2 (3)

రూపకల్పనలో దోషాలు:

ఏప్రిల్ మధ్యలో చాలా మీడియా సంస్థలు డేటా విషయంలో చాలా తప్పులు ఉన్నాయని ప్రభుత్వానికి తెలిపారు. దీనిపై ప్రభుత్వ అధికారులు మాత్రం చిన్న పొరపాట్లే అంటూ తప్పించుకున్నారు.

ఆర్టికల్ 14 చాలా డాక్యుమెంట్లను రివ్యూ చేశాక.. ప్రాథమికంగానే ఇందులో తప్పులు ఉన్నాయని తేల్చింది. డేటాను అప్డేట్ చేయడంపై ఐసిఎంఆర్ కు రాష్ట్రాలు చెప్పినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేదని తేలింది. కొన్ని మెయిల్స్ తాను పంపించానని.. అయినా ఐసిఎంఆర్ నుండి ఎటువంటి స్పందన లేదని అధికారి తెలిపారు.

ఐసిఎంఆర్ డేటాను టెస్టింగ్ ల్యాబొరేటరీల నుండి తీసుకుంటున్నా.. అందులో ఎందుకు తప్పులు ఉన్నాయి:

ఐసిఎంఆర్ డేటాను టెస్టింగ్ ల్యాబొరేటరీల తీసుకుంటోంది.. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోలేకపోతోందని అధికారి తెలిపారు. కొన్ని సార్లు కొందరు సరైన అడ్రెస్ అన్నది చెప్పరని.. అలాగే ఫీల్డ్ స్టాఫ్ కూడా శాంపుల్స్ కు సంబంధించిన డేటాను కరెక్ట్ గా పూరించకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయని అన్నారు. ఐసిఎంఆర్ డేటాబేస్ అన్నది వెరిఫికేషన్ అన్నదే లేకుండా ఉన్న డేటాబేస్ అని ఆయన అన్నారు. ఒకే వ్యక్తికి చెందిన అడ్రెస్ నే చాలామంది ఫిల్ చేయడం.. తప్పుడు అడ్రెస్ కూడా ఇవ్వడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 29 వరకూ కూడా ఐసిఎంఆర్ రాష్ట్ర, జిల్లా అధికారులకు డేటా బేస్ లో ఉన్న తప్పులను సరిచేయడానికి అవాకాశం ఇవ్వలేదు.

ఐసిఎంఆర్ ఉపయోగించే ఫామ్ ను కూడా ఆర్టికల్ 14 రివ్యూ చేసింది. ఈ రెండు నెలల కాలంలో కేవలం స్వల్ప మార్పులు దీనిపై చోటుచేసుకున్నాయి.

Jaa

ఐసిఎంఆర్ డేటాను కలెక్ట్ చేస్తోంది అనగానే చాలా మంది కేంద్ర రాష్ట్రాల అధికారులు తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ఐసిఎంఆర్ ప్రతిసారి ఎన్.సి.డి.సి. డేటాను ఉపయోగించేది. ఐసిఎంఆర్ అన్నది సైంటిస్టులు చెప్పిన డేటా ప్రకారం రూపొందించబడినది కాగా.. ఎన్.సి.డి.సి. అన్నది ఆన్ ఫీల్డ్ కు సంబంధించిన డేటా అని తేలుతోంది.

తప్పులు ఉన్న డేటా బేస్ ప్రభావం ఎలాంటిదంటే:

తమ డేటా బేస్ లో ఉన్న తప్పులను సరిచేసుకోడానికి ఐసిఎంఆర్ చాలా కష్టం పడుతోంది. ఏప్రిల్ మధ్యలో చాలా రాష్ట్రాలు కేంద్రానికి ఐసిఎంఆర్ పై ఫిర్యాదు కూడా చేశాయి. తాము దీనిపై దృష్టి సారిస్తామని కేంద్రం నుండి రాష్ట్రాలకు హామీ వచ్చింది.

ఏప్రిల్ 29న ఐసిఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలను తప్పులు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని.. రెండు డేటా బేస్ ల మధ్య ఉన్న బేధాలను పరిష్కరించుకునేలా సూచనలను చేయాలని కోరింది.. అయిదు రోజుల డెడ్ లైన్ ను కూడా ఇచ్చింది. ఐసిఎంఆర్ కు చెందిన డేటా బేస్ ను కేవలం 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఫర్ పేషెంట్స్ డేటా' గా పరిగణించాలని కోరింది.

ఆర్టికల్ 15 రిపోర్ట్ చేసిన ప్రకారం ఏప్రిల్ 15, కేంద్ర ప్రభుత్వం 739 జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లను ఐసిఎంఆర్ డేటాబేస్ కారణంగా విడదీసింది. మే 1న కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను అమలు చేసే సమయంలో కూడా ఇదే డేటాబేస్ ను పరిగణలోకితీసుకుంది. రెడ్ జోన్స్ కు సంబంధించి మరికొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని భావించింది. మొత్తం నాలుగు ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని మహమ్మారి తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవాలని ప్రభుత్వం భావించింది. వాటిలో రెండు మాత్రం కేసుల సంఖ్య.. ఏ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకుని లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఇదంతా ఐసిఎంఆర్ డేటాబేస్ ను దృష్టిలో పెట్టుకునే అమలుచేశారు.

8

కొత్తగా తీసుకుని వచ్చిన RT-PCR యాప్ ను ఉపయోగించాలని ఐసిఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. ఏప్రిల్ ఆఖరు వారంలో ఈ యాప్ ను తీసుకుని వచ్చారు. ఈ యాప్ ద్వారా డేటా బేస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవచ్చు. యాప్ ద్వారా చేసే డాక్యుమెంటేషన్ కు.. మాన్యువల్ గా చేసే డేటా ఎంట్రీల కారణంగా పొరపాట్లు జరిగే అవకాశం ఉందని మూడు రాష్ట్రాలకు చెందిన అధికారులు అన్నారు.

3 (1)

రాష్ట్రాల అధికారులకు, ల్యాబొరేటరీలకు, డాక్టర్లకు దీని వలన అయోమయ పరిస్థితి ఎదురయ్యింది. ఫ్రంట్ లైన్ స్టాఫ్ అన్ని ప్రొటెక్టివ్ పరికరాలు వేసుకుని మొబైల్ ను ఆపరేట్ చేయడం ఎలా అని ప్రశ్నించారు. యాప్ ను విడుదల చేసిన తర్వాత ఐసిఎంఆర్ పాత డేటా విషయంలో కూడా కొన్ని మార్పులు చేసింది.

4

6

ట్రైనింగ్ మెటీరియల్ ను యూనియన్ హెల్త్ మినిస్ట్రీ నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు మే 7న పంపారు. డేటా మేనేజ్మెంట్ విషయంలో ప్రొటొకాల్స్ ను రివైజ్ చేశారు.

ఐసిఎంఆర్ ఎట్టకేలకు డేటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెరిఫై చేసేట్టుగా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం డేటాను చూసి అందులో ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే చేసే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇది మొదటి రోజు నుండే అమలు చేసి ఉండి ఉంటె చాలా మంచి ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఐసిఎంఆర్ డేటాబేస్ ప్రకారం మే 10వ తేదీ నాటికి మూడు పెద్ద రాష్ట్రాలు తమ డేటాను అప్డేట్ చేయడంలో విఫలమయ్యాయి. ఆర్టికల్ 14 ఇండిపెండెంట్ గా డేటాను వెరిఫై చేయలేదు. డేటా సమగ్రతను కాపాడాలి.. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి... కానీ సరైన డేటాను అందించాలి. డేటాను డేటాబేస్ లోకి ఎక్కించే వారికి ట్రైనింగ్ ఇవ్వాలి.. పలు ప్రొటొకాల్స్ ను పాటించేలా సూచనలు కూడా ఇవ్వాల్సిందే.. లేదంటే డేటా మొత్తం తప్పులతడకలా మారిపోయే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రధాని లాక్ డౌన్ ఎత్తివేయాలని భావించినా అది ఐసిఎంఆర్ డేటాబేస్ ను పరిగణలోకి తీసుకునే చేస్తారు. కాబట్టి డేటా అన్నది సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

-మృదుల చారి - నితిన్ సేథీ

Next Story
Share it