శిశువు తల, మొండెం వేరు.. ప్రభుత్వ వైద్యుల నిర్వాకం

By అంజి  Published on  21 Dec 2019 4:25 AM GMT
శిశువు తల, మొండెం వేరు.. ప్రభుత్వ వైద్యుల నిర్వాకం

ముఖ్యాంశాలు

  • నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం
  • గర్భిణీకి డెలివరీ సమయంలో శిశువు తల, మొండెం వేరు చేసిన వైద్యలు
  • విషయాన్ని గోప్యంగా ఉంచిన వైద్యలు
  • తల్లి పరిస్థితి విషమం, జజ్జిఖాన ఆస్పత్రిలో చికిత్స
  • ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మరోక డాక్టర్‌ సస్పెండ్‌

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. కాసేపట్లో భూమి మీదకు రావాల్సిన నవశిశువు.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తల్లి కడుపులోనే కన్ను మూసింది. వివరాల్లోకి వెళ్తే.. మూడు రోజుల క్రితం అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన సుగురి స్వాతి అనే గర్భిణిని డెలివరీ కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. సుఖ ప్రసవం జరుగుతుందని చికిత్సలు చేసిన వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యలు తెలిపారు. మూడవ రోజు డెలివరీ చేసిన డాక్టర్లు నార్మల్‌ డెలివరీ చేస్తుండగా తల భాగం తెగిపోయిందని మృత శిషువు మొండెం గర్భంలో మిగిపోయిన విషయాన్ని వైద్యులు గోప్యంగా ఉంచారు. తల్లి పరిస్థితి సీరియస్‌గా ఉందని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పి.. హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రిఫర్ చేశారు.

గర్భిణీని వెంటనే జజ్జిఖాన ఆస్పత్రికి తరలించారు. గర్భిణీకి ఆపరేషన్‌ చేసి మృత శిశువును వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం ఆ తల్లి పరిస్థితి పూర్తి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొండెం లేని మృత శిశువుని వైద్యులు కుటుంబ సభ్యులకు చూపించడంతో కంగుతిన్నారు. బాధితురాలి బంధువులు అచ్చంపేట ఆసుపత్రికి వచ్చి జరిగిన ఈ దారుణం గురించి ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో ఆసుపత్రి అద్దాలను పగులగోట్టి వైద్యులపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పోలీసులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. నిర్లక్ష్యంగా విధులకు నిర్వహించి పసికందు మృతికి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని బాధిత బంధువులు డిమాండ్ చేశారు. కడుపులోని మొండెంతో ప్రాణాపాయ స్థితిలో

బాలింత హైదరాబాద్ లో చికిత్స పోందుతుంది ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తమకు హైదరాబాద్‌కు తీసుకెళ్లాకే శిశువుకు తల లేదని తెలిసిందని బాధితురాలి భర్త సాయిబాబు తెలిపారు. తన భార్యను ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించినప్పుడు అందరూ డాక్టర్లు బాగానే ఉందని చెప్పారని పేర్కొన్నారు. మరోవైపు తల్లిని కాపాడానికే హైదరాబాద్‌కు రెఫర్‌ చేశామని అచ్చంపేట ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. బాధితురాలి కడుపులో శిశువు పొట్ట లావుగా ఉందని రిపోర్టులో తేలిందన్నారు. అయితే శిశువు తల భాగం మెత్తగా ఉండడం వల్లే బయటకు లాగే సమయంలో శిశువు తల భాగం వేరుపడిందని వైద్యులు చెప్పుకొచ్చారు.

ఘటనపై స్పందించి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..

ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని, బాధకరమని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. జరిగిన ఘటనపై ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడానన్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ ఇప్పటికే ఆస్పత్రిని సందర్శించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గువ్వల బాలరాజు అన్నారు. కాగా కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తారాసింగ్‌, డాకర్ట్‌ సుధారాణిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story