హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి మిస్సింగ్.. హాస్టల్‌లో రక్తం మరకలు
By అంజి Published on 13 Feb 2020 6:35 AM GMTహైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు కలకలం సృష్టిస్తోంది. మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జీవన్‌రెడ్డి అనే విద్యార్థి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ సమీపంలోని హరిహర బాయ్స్ హాస్ట్‌లో ఉంటున్న జీవన్‌రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. విద్యార్థి జీవన్ రెడ్డి కనిపించడం లేదని 11వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థి తండ్రి పెట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హాస్టల్‌లోని జీవన్‌రెడ్డి గదిలో రక్తం మరకలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. బ్లెడ్‌తో పాటు అతని బట్టలపై రక్తం మరకలు ఉన్నాయి. హాస్టల్ నుండి బయటకు వెళ్లేముందు జీవన్ తొటి రూమ్స్‌మెట్స్‌తో గొడవకు దిగాడాని తెలుస్తోంది. కాగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవన్ రెడ్డి చివరిసారిగా ఫోన్‌లో ఎవరితో మాట్లాడాని, రూమ్‌మెట్స్‌తో ఎందుకు గొడవకు దిగాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జీవన్‌రెడ్డి తమతో మంగళవారం రాత్రి చివరిసారిగా మాట్లాడానని తల్లిదండ్రులు టీవీ9 ప్రతినిధికి చెప్పారు. డబ్బుల విషయంలో తమ కుమారుడిని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేయలేదని, డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్లమని తెలిపారు.
మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో జీవన్‌రెడ్డి మిస్ అయ్యాడని పెట్‌బాషీర్‌బాద్ సీఐ చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామన్నారు. హాస్టల్ సిబ్బందిని, జీవన్‌రెడ్డి రూమ్‌మేట్స్‌ని విచారిస్తున్నామని సీఐ తెలిపారు. పూర్తి ఆధారాలు బయట్టపడ్డ తర్వాత మరిన్ని విషయాలు చెప్తామన్నారు. మైసమ్మగూడలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని సీఐ తెలిపారు.