ఆర్మీ నుండి వ‌చ్చిన భ‌ర్త‌..వేరే వ్య‌క్తితో భార్య రూములో అలా..

By రాణి  Published on  13 Feb 2020 6:03 AM GMT
ఆర్మీ నుండి వ‌చ్చిన భ‌ర్త‌..వేరే వ్య‌క్తితో భార్య రూములో అలా..

ఆ యువ‌కుడు దేశ సేవ‌కు ప్ర‌తి రూప‌మైన ఆర్మీలో ప‌నిచేస్తున్నాడు. సంవ‌త్స‌రానికి ఏ రెండు మూడు నెల‌లు మిన‌హా ఇంటికి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. ఇంట్లో వారు మంచి సంబంధం చూడ‌టంతో పెళ్లి చేసుకున్నాడు. సెల‌వుల‌కు ఇంటికి వ‌స్తూ.. ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ ఆర్మీకి ఇలా వెళ్తూ వ‌స్తుండేవాడు. ఈ క్ర‌మంలోనే బంధువుల ఇంట పెళ్లి కావ‌డంతో సెల‌వులు పెట్టి వ‌చ్చిన ఆ యువ‌కుడికి ఇత‌రుల ద్వారా తెలిసిన స‌మాచారం ఖంగుతినేలా చేసింది. అస‌లు అది నిజ‌మో.. కాదో తెలుసుకుందామ‌ని వెళ్లగా త‌న భార్య వేరే వ్య‌క్తితో ఆ భంగిమ‌లో ఉండ‌టం చూసి షాక‌య్యాడు. ఈ ఉదంతం ప్ర‌కాశం జిల్లా వేట‌పాళెంలో చోటు చేసుకుంది.

ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా క‌ర్ల‌పాళెం గ్రామానికి చెందిన సునీల్‌రాజ్‌, అనూష భార్య భ‌ర్త‌లు. సునీల్ రాజ్ కాశ్మీర్‌లో ఆర్మీ విధులు నిర్వ‌హిస్తుండ‌గా, అనూష‌ వేట‌పాళెం పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తుంది. త‌ప్పు చేసిన వారి తాట తీయాల్సిన వృత్తిలో ఉన్న అనూష తానే త‌ప్పు చేస్తూ భ‌ర్త‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. తాను విధులు నిర్వ‌హిస్తున్న‌ వేట‌పాళెంలో అభిషేక్ స్టీఫెన్ అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఇద్ద‌రూ రూములో క‌లిసి ఉండ‌గా భ‌ర్త సునీల్ రాజ్ వారిని రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకుని వీడియో తీశాడు.

అనూష‌, అభిషేక్ స్టీఫెన్ ఇద్ద‌రూ ఒకే రూములో ఉండ‌గా వెళ్లిన సునీల్‌రాజ్‌పై అస‌లు నీవెవ‌రంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. సంవ‌త్స‌రం క్రితం వ‌దిలేసి వెళ్లినందుకే నువ్వెవ‌రంటున్నా అంటూ అనూష సునీల్‌రాజ్‌పై విరుచుకుప‌డింది. ఇంత‌లో క‌ల‌గ‌జేసుకున్న అభిషేక్ బాసూ కూర్చుని మాట్లాడుదామంటూ సునీల్‌రాజ్‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

భ‌ర్త సునీల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ..' మాది గుంటూరు జిల్లా క‌ర్ల‌పాళెం గ్రామం. కాశ్మీర్ ఆర్మీలో విధులు నిర్వ‌హిస్తున్నా. నా భార్య అనూష ప్ర‌కాశం జిల్లా వేట‌పాళెం పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తుంది. బామ్మ‌ర్ది పెళ్లిక‌ని రావ‌డంతో బంధువుల ద్వారా భార్య అక్ర‌మ సంబంధం గురించి తెలిసింది. వారిచ్చిన స‌మాచారం మేర‌కు వేట‌పాళెం పాత బ‌స్టాండ్ ఎదురుగా ఉన్న ఒక‌ రూములో అనూష‌, అభిషేక్ ఇద్ద‌రూ ప‌డ‌కపై రాస‌లీల‌లు చేస్తుండ‌గా ప‌ట్టుకున్నా. వీడియోలు, ఫోటోలు తీస్తుండ‌గా అస‌లు నీవెవ‌ర‌ని అనూష‌ ప్ర‌శ్నించింది.

Next Story
Share it