రామ జన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం..

By అంజి  Published on  25 March 2020 11:21 AM GMT
రామ జన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం..

ఉత్తరప్రదేశ్‌: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టంది. రామజన్మ భూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు. చైత్ర నవరాత్రి పర్వదినం పురస్కరించుకొని అయోధ్యలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో సీఎం యోగి పాల్గొన్నారు. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ తన చేతుల మీదుగా రాముని విగ్రహాన్ని రామమందిరం తాత్కాలిక నిర్మాణంలోకి తరలించారు.

Ayodhya Ram Mandir

మందిరం నిర్మాణం కోసం రాముని విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకువచ్చారు. 9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. సింహాసనాన్ని జైపూర్‌కు చెందిన కళాకారులు రూపొందించారు. దీన్ని శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో సభ్యునిగా ఉన్న రాజ అయోధ్య విమలేంద్ర మోహణ్‌ మిశ్రా బహుమతిగా ఇచ్చారు. మందిరం నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలిక నిర్మాణంలోనే రాముని విగ్రహాం ఉండనుంది. ఆలయ నిర్మాణం కోసం సీఎం యోగి రూ.11 లక్షల విరాళాన్ని అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలోనే అధికారులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో సీఎం యోగితో పాటు అయోధ్య జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: అమెరికా: 2 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ప్యాకేజీ

Ayodhya Ram Mandir

ఏప్రిల్‌ మొదటి వారంలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇది వరకే ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అందరూ లాక్‌డౌన్‌ పాటించాలని ప్రధాని మోదీ చెప్పిన గంటలకే.. ఇలా యోగి ఆదిత్యనాథ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంపై పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Also Read: ఇంటి అద్దె అడగొద్దు.. సీఎం విజ్ఞప్తి

Next Story