ఇంటి అద్దె అడగొద్దు.. సీఎం విజ్ఞప్తి

By సుభాష్  Published on  25 March 2020 10:54 AM GMT
ఇంటి అద్దె అడగొద్దు.. సీఎం విజ్ఞప్తి

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రేమ్ హోమ్ చేస్తుండగా, మరి కొంతమంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది.

కొందరి పరిస్థితి అయితే రోజు పనులు చేసుకుంటేనే ఇళ్లు గడిచే పరిస్థితి. అలాంటి వారిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. అద్దెకు ఉంటున్న వారిని ఇంటి యజమానులు అద్దె డబ్బుల కోసం వేధించవద్దని కోరారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు కరోనా వైరస్ కారణంగా ఏ పనులు చేసుకోకుండా ఇళ్లకే పరిమితం అవుతున్న నేపథ్యంలో సీఎం ఈ విజ్ఞప్తిని చేశారు. వారు ఒకటి, రెండు నెలల్లో ఇస్తారని, అలాగే వాయిదాల రూపంలో వసూలు చేసుకుని పేదలను ఆదుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇక రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో బాధపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

Next Story