గాలి నుండి మంచి నీటిని సేకరించే యంత్రం
By Newsmeter.Network Published on 26 Dec 2019 6:08 PM IST
గాలిలో నుండి నీటిని ఉత్పత్తి చేసే అట్మాస్పియరిక్ వాటర్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నూతనంగా అమర్చారు. అవును మీరు విన్నది నిజమే ఈ యంత్రం గాలిలో నిండి నీటిని ఉత్పత్తి చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ లో అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ కియోస్క్ ను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్ ను హరిత హారం మరియు నీటి సంరక్షణ చర్యలలో భాగంగా దీనిని స్థాపించడం జరిగింది.' మైత్రి ఇన్ అక్వాటిక్' ,' మేక్ ఇన్ ఇండియా' కాన్సెప్ట్ కింద దీనిని ఏర్పాటు చేశారు. అయితే దీనికి 'మేగ్ ధూత్' అని నామకరణం చేశారు. ఈ వ్యవస్థలో వడపోత మరియు వినియోగం కోసం నీటిని మాములుగా తీసుకునే బదులు నీటిని నేరుగా దశల వారీగా గాలి నుండు సేకరిస్తారు.
దీనిలో భాగంగా తేమతో నిండిన గాలిని వడపోత వ్యవస్థలోకి పంపిస్తారు. ఇక్కడ గాలిలో ఉన్న కలుషితాలను తొలిగించిన తరువాత వడపోత వ్యవస్థ నుండి గాలి యంత్రంలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ఫిల్టర్ చేసిన గాలి శీతలీకరణ గాడి గుండా వెళ్తుంది. అక్కడ గాలి ఘనీకృతమవుతుంది. ఈ దశలో గాలి నీటిగా మార్చబడుతుంది తరువాత ఈ నీరు నిల్వ ట్యాంక్ లో పడిపోతుంది. దీని నుండి నీరు బహుళ స్థాయి వడపోత గుండా వెళ్తున్నపుడు వాసన ఇతర మలినాలు తొలగించబడుతాయి. అక్కడి నుండి అల్ట్రా వైలెట్ వ్యవస్థలోకి వెళ్తుంది ఇలా ఫిల్టర్ చేసిన నీటిలో ఖనిజాలు అవసరమైన మోతాదులో ఉంటాయి
అట్మాస్పియర్క్ వాటర్ జనరేటర్ ను ఉపయోగించుకొని నీరు దొరకని ప్రాంతాల్లో కూడా నీటిని సృష్టించుకోవచ్చు. నీటి కోసం ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. దీని నిర్వహణకు అదనపు ఖర్చులు ఏమి ఉండవు వాతావరణం నుండి నీటిని సేకరిస్తుంది. భూమి నుండి తీసుకునే నీటిలో సూక్ష్మజీవులు ఉండే ఆస్కారం ఉంది గాని వాతావరణం నుంచి వచ్చే నీటిలో ఎలాంటి క్రిములు వచ్చే అవకాశం ఉండదు.