'ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏమిటీ..?
By సుభాష్ Published on 13 May 2020 7:11 PM ISTఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ వివరాలను ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. ఆత్మ నిర్భర్ భారత్ అనే పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు మోదీ. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అంటే చాలా మందికి తెలియదు. దీని అర్థం ఏమిటీ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు.
ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతం అని చెప్పారు. అన్ని రంగాల్లో మన దేశం ఇటీవల సాధించిన ఫలితాలే పునాదులుగా ఈ ప్రాజెక్టులు తీసుకువచ్చారు. ఈ ఆత్మ నిర్బర్ భారత్ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఐదు మూల సూత్రాలుగా మోదీ ఈపేరుతో ప్రకటన చేశారని అన్నారు. అవే.. ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, సాంకేతిక, జనాభా, గిరాకీ అని, భారత్ ఎవరిపైనా కూడా ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఎదిగేందుకే ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు పేర్కొన్నారు.