వార ఫలాలు : ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి

కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని ఋణాలు తీర్చగలుగుతారు.

By -  Medi Samrat
Published on : 14 Sept 2025 4:02 PM IST

వార ఫలాలు : ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి

మేషం :

కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. దీర్ఘ కాలిక సమస్యలను మిత్రుల సహకారంతో పరిష్కరించుకుంటారు. భూ సంభందిత వివాదాలు తొలగుతాయి. నూతన వ్యాపారాల‌లో ఆశించిన లాభాలు పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం చివరన ధన వ్యయ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభం :

ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రామ ఆపదుద్దారణ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిధునం :

ఇంట బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమున మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటకం :

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పెరుగుతుంది. ఆలోచనలలో స్థిరత్వం లోపించడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు దైవదర్శనం చేసుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో అవరోధాలు ఉంటాయి. వారం మధ్యనుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం :

నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసివస్తాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగవిషయంలో అధికారులతో మనస్పర్థలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం చివరన చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య :

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. చిన్న తరహా పరిశ్రమలవారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చికం :

నూతన పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి ధన పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

ధనస్సు :

వారం ప్రారంభంలో మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాలునుండి బయటపడి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకరం :

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణ కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభం :

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీనం :

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతోనూ వివాదాల నుంచి బయటపడగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story