విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు : మీ ఆదాయ, వ్యయాలు తెలుసుకోండి..!

రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉన్నది. మేష రాశి వారు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకుండా చూసుకోవాలి.

By జ్యోత్స్న
Published on : 30 March 2025 8:46 AM IST

విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు : మీ ఆదాయ, వ్యయాలు తెలుసుకోండి..!

మేష రాశి: (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఆదాయం 2, వ్యయం 14 | రాజపూజ్యాలు 5 అవమానాలు 7:

రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉన్నది. మేష రాశి వారు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకుండా చూసుకోవాలి. ఏలినాటి వలన అనుకోని సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం విషయానికొచ్చేసరికి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. ఆర్థికం, ఆరోగ్యం విషయంలో శుభ ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి పూజించడం, దశరథ ప్రోక్త, శని స్త్రోత్తం పారాయణం చేయడం, శనికి తైలాభిషేకం చేయడంతో శుభ ఫలితాలు పొందగలరు.

వృషభ రాశి : (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యాలు 1, అవమానాలు 3

ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆర్థికపరంగా ప్రయోజనం పొందుతారు. పెట్టుబడులు కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గాంటారు. ధనలాభం, సంతోషం. వీరికి ఆర్థిక పరంగా అనుకూలమైన సంవత్సరం. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఆనందం పొందుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం, విష్ణు సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం వల్ల మరింత శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఆదాయం 14, వ్యయం 2 | రాజపూజ్యాలు 4, అవమానాలు 3:

కొత్త పెట్టుబడుల కోసం డబ్బులను సమకూర్చుకుంటారు. ఆర్థిక పరంగా పురోగతి ఉన్నప్పటికీ ఒత్తిళ్లు ఎదురవుతాయి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మ రాశిలో గురుని ప్రభావం టెన్షన్లు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. బీపీ, హార్ట్ సమస్యలతో ఇబ్బందిపడే సూచనలున్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించడం వల్ల ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి: (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఆదాయం 8, వ్యయం 2 | రాజపూజ్యాలు 7, అవమానాలు 3:

కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా ఖర్చులతో కూడుకున్నటువంటి ఫలితాలున్నాయి.అనుకోని ఖర్చులు వంటివి పెరుగును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆర్థికపరంగా ఉద్యోగస్థులకు సంపాదన ఉన్నప్పటికీ కుటుంబ అవసరార్థం అనుకోని ఖర్చులు చేయవలసిన స్థితులు కనపడుచున్నాయి. వ్యాపారస్థులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కొంత ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం కనపడుతుంది. కర్కాటక రాశి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆరోగ్య నిమిత్తం ధనము, వ్యయము అగు సూచనలు కనిపించుచున్నాయి. కర్కాటక రాశి వారు ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా శుభఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించండి. నవగ్రహ పీడా స్త్రోత్రం పఠించడం చేత శుభ ఫలితాలు పొందగలరు.

సింహ రాశి : (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఆదాయం 11, వ్యయం 11 | రాజపూజ్యాలు 3, అవమానాలు 6:

ఆర్థిక పరంగా మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆదాయాన్ని పెంచుకుంటరు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్ల వంటివి కలిసివస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి. పనులలో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు కొంత చికాకులు తెప్పిస్తాయి. సింహ రాశి వారికి ఆరోగ్య విషయంలో అంత అనుకూలంగాల లేదు, జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం కోసం శనికి తైలాభిషేకం, దశరథ ప్రోక్త శని స్త్రోత్రాన్ని పారాయణం చేయండి. సూర్యాష్టకం పఠించండి.

కన్య రాశి :(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఆదాయం 14, వ్యయం 2 | రాజపూజ్యాలు 6, అవమానాలు 6:

ఆర్థిక పరంగా కన్యా రాశికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వ్యాపారస్తులు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రిస్తారు. సమాజంలో కీర్తి, గుర్తింపు, ఆర్థిక లాభమును పొందెదరు. ఆరోగ్య విషయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. మీరు చేసిటువంటి ప్రయత్నాల వల్ల ఆరోగ్యం బాగుండును. గ్యాస్ట్రిక్ వంటి సమస్యల మీద శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారికి మరిన్న శుభఫలితాల కోసం దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం మంచిది.

తుల రాశి : (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యాలు 2, అవమానాలు 2:

ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన గృహాలు వంటివి అనుకూలిస్థాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో తులా రాశి వ్యాపారస్తులకు లాభదాయకం, ఉద్యోగస్థులకు ధన లాభం, స్త్రీలకు ఆరోగ్యం, సౌఖ్యం కలుగును. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మనసు లోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. మరిన్ని శుభఫలితాల కోసం తులా రాశి వారు లక్ష్మీదేవిని పూజించండి.

వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఆదాయం 2, వ్యయం 14 | రాజపూజ్యాలు 5, అవమానాలు 3:

ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. ధన లాభం ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఖర్చులు ఉండును. మీరు సంపాదినటువంటి ధనాన్ని అప్పులు, లోన్లు వంటివి తీర్చడానికి వినియోగించెదరు. . ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరు గుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. గృహాలు, బంగారం వంటి వాటిలో ఇన్వెస్టమెంట్లు చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించండి. నవగ్రహ పీడాహార స్త్రోత్నాన్ని పారాయణం చేయండి.

ధనుస్సు రాశి: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ఆదాయం 5, వ్యయం-5 | రాజపూజ్యాలు 1, అవమానాలు 5:

ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్తగా చేయగల ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియనివారికి ధన సహాయం వంటివి చేయడం, అప్పు ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్థులకు ఆర్థికపరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. రావాల్సిన ధనం చేతికి రావడంలో ఆలస్యం కలుగును. శుభ కార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. అనా రోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఈ రాశివారు ఎక్కువగా శివార్చన చేయించడం చాలా మంచిది.

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఆదాయం 8, వ్యయం 14 | రాజపూజ్యాలు 4, అవమానాలు 5:

ఆర్థికపరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలగనున్నాయి. అప్పుల బాధ నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు మొదలుపెడతారు.అప్పులు, లోన్లు వంటివి తీర్చే క్రమంలో ఖర్చులు పెరుగును. నూతన పెట్టుబడుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్థులకు మధ్యస్థ సమయం. ఆశించిన స్థాయి లాభాలు మాత్రం ఉండవు. మకర రాశికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాల్సిన సంవత్సరం. అనారోగ్య సమస్యలు కలుగు సూచన. శత్రుపీడ, అనారోగ్య బాధలు అధికముగా ఉన్నాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు కోసం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా పొందడానికి దత్తాత్రేయుని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వరున్ని ఆలయ దర్శన చేయడం, అభిషేకం చేయడం చేత మరింత శుభఫలితాలు పొందగలరు.

కుంభ రాశి :

(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఆదాయం 8, వ్యయం 14 | రాజపూజ్యాలు 3, అవమానాలు 5:

ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దని సూచన.

కుంభరాశి వారికి సమయానికి డబ్బు అందకపోవడం, ఖర్చు అధికంగా అవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగస్థులకు ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. కుంభరాశి వారికి శ్రీవిశ్వావసు సంవత్సరంలో ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. జన్మ రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిళ్లు, సమస్యలు వేధించును. బీపీ, టెన్షన్లు నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలని సూచన. కుంభ రాశి వారు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మరింత శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేసుకోండి. దక్షిణామూర్తిని పూజించండి. నవగ్రహ పీడాహర స్త్రోత్తాన్ని పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

ఆదాయం 5, వ్యయం 5 | రాజపూజ్యాలు 3, అవమానాలు 11:

మీనరాశి వారికి ఆర్థికపరంగా విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలిస్తుంది. ధన సంపాదన ఉన్నప్పటికీ మీ సంపాదనను కుటుంబం కోసం, మీ యొక్క అవసరాల కోసం ఖర్చు చేసేదెరు. ఖర్చులు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. తెలియని పెట్టుబడులకి, అప్పులు ఇచ్చే వ్యవహారాలు వంటి వాటిలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్థులకు ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. ఉద్యోగస్థులకు ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. మీనరాశి వారికి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టును. శుభఫలితాలు పొందడానికి శనివారం నవగ్రహ ఆలయాలను దర్శించండి. శనికి తైలాభిషేకవం వంటివి చేసుకోండి.

Next Story