2026-2027 : శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలు
ఈ సంవత్సర ప్రారంభాన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
By - Medi Samrat |
మాసవారీ ఫలితములు
🎉మేష రాశి 🎉
అశ్వని 1,2,3,4 పాదములు (చూ,చే,చో,లా)
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ,లూ,లే,లో)
కృత్తిక 1 పాదము (ఆ)
ఆదాయం - 11, వ్యయం - 5, పూజ్యత - 2, అవమానం - 4
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) ఈ సంవత్సర ప్రారంభాన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహప్రవేశాలు జరుగుతాయి. విద్యా, వినోద గోష్ఠులలో పాల్గొంటారు. మంచి ధనాదాయం, ఉన్నత పదవులు పొందే అవకాశం కలదు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) విలాసవంతమైన సుఖ జీవనం లభిస్తుంది. సంతాన వృద్ధి ధనాదాయాలు బాగుంటాయి. ఆరోగ్యంలో కొంచెం మార్పు వస్తుంది. వ్యాపార నష్టంతో పాటు అప్పుల బాధ ఉంటుంది. పితృదేవతల అనుగ్రహం బాగా కలసి వస్తుంది.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )వస్తువలును పోగొట్టుకుంటారు. ధనం ఖర్చు అవుతుంది. అపనిందలకు గురి అవుతారు. అప్పుల బాధ ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసిక ఆందోళన ఉంటుంది. పిల్లలు మాట వినరు.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) పోటీలలో విజయం లభిస్తుంది. గాయాలు తగలవచ్చు. అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. వృధా ఖర్చులుంటాయి. ఆస్తిలో మార్పులు వస్తాయి. ఇతరుల సహకారంతో ఆపద నుండి తప్పించుకుంటారు. ఆరోగ్యం అంతగా సహకరించదు.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) దేశ సంచారం, శారీరక, మానసిక నలత, ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అధికారులు అదరిస్తారు. వృథా ఖర్చులు ఉంటాయి.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11)స్థిర చిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రులకు గడ్డు రోజులు, ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖశాంతులు లభిస్తాయి. శక్తి సామర్థ్యములు బాగా ప్రదర్శిస్తారు.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10)బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. తెలివి బాగా పని చేసినా, ధనసంపాదన విషయంలో అంత మంచి ఫలితాలుండవు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. పదవీచ్యుతి ఏర్పడుతుంది. వృథా వ్యయం ఉంటుంది. ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9) ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశవ్యాధులు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. కృషిలో లోపం లేకపోయినా నష్ట పరంపరలు ఉంటాయి. ఇంట బయట మానసిక అశాంతి వుంటుంది. విద్య వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం, పేరు ప్రతిష్ఠలు ఉంటాయి.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. శస్త్ర చికిత్సకు గురి కావచ్చు. ఋణం ఉంటుంది. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. అలసట ఎక్కువగా ఉంటుంది.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) ఖర్చులు ఎక్కువ కావడం అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు దూరం, శస్త్ర చికిత్సకు గురి కావచ్చు. ఋణం ఉంటుంది. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. తండ్రికి అంత మంచి సమయం కాదు. కొన్ని శుభకార్యాలు జరగడం, భోజన ప్రాప్తి ఉంటుంది. ధన నష్టం, విపరీతమైన ఖర్చులుంటాయి. వారి ఆశీర్వచనంతో అన్ని పనులు చక్కగా సాగుతాయి.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనదాయం, ప్రయత్న లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దొంగతనం జరుగవచ్చు. దూర ప్రయాణం ఉంటుంది. వ్యాపార నష్టంతో పాటు అప్పుల బాధ ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) అనారోగ్యం ఊహించని రీతి కష్ట నష్టాలు, దూర సంచారం, ఖర్చులు, ధనాదాయం ఉంటుంది. అనుకొన్నవి సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తులు సమకూరతాయి. విద్యా, వినోద, గోష్టులలో పాల్గొంటారు.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
ఈ సంవత్సరం మేష రాశి వారు ఏలి నాటి శని దోషం శని వారం నల్ల నువ్వులు దానం తైలాభిషేకం శని స్తోత్రం పారాయణం చెయ్యాలి. సుబ్రమణ్య స్వామి ఆరాధనా నిత్యం చెయ్యాలి మంగళవారం 1 ¼ kg కందులు దానంగా ఇవ్వాలి.
🎉వృషభ రాశి 🎉
కృత్తిక 2, 3, 4, పాదములు (ఈ,ఊ,ఏ)
రోహిణి 1, 2, 3, 4 పాదములు (ఓ,వా,వీ, వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)
ఆదాయము -5, వ్యయం-14, పూజ్యత-5, అవమానం-4
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) ఖరీదైన వస్తువులు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం ప్రయత్నం లోపం లేకున్న ఫలితం మంచిగా ఉంటుంది. దొంగతనాలు జరుగవచ్చు. సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి ఉంటాయి. భార్య మూలకంగా సహాయ సహకారాలు లభిస్తాయి.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) ఊహించని రీతిన నష్టాలు జరుగుతాయి. దూర సంచారం, అధిక ఖర్చులు ఉంటాయి. సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి వృద్ధి ఉంటాయి. పదోన్నతి లభిస్తుంది. శారీరిక సౌఖ్యం, మనశ్శాంతి ఉంటుంది.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )అనవసరపు గొడవలు వివిధ రకాలైన జబ్బుల తీవ్రత ఉంటుంది. ధన వ్యయం దుష్ట సావాసం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ అధికం అవుతుంది. విద్యారంగంలో విద్యార్థులు రాణిస్తారు. కార్మికులకు నుంచి లాభాలుంటాయి.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) పోటీలలో వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘవ్యాధులు ఏమిచేయవు. సంఘంలో హోదా పెరుగుతుంది.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్కు సంభందించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. పదోన్నతి లభిస్తుంది. ధీర్ఘవ్యాధులు ఏమిచేయవు. సంఘంలో హోదా పెరుగుతుంది.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11)దేశ సంచారం, శారీరక, మానసిక నలత ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘ వ్యాధులు ఏమిచేయవు. సంఘంలో హోదా పెరుగుతుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10)స్థిరచిత్తం ఉండదు. సంతానానికి తల్లిదండ్రులకు గడ్డు రోజులు తల్లిదండ్రుల ఆరోగ్యానికి మేనమామలకు చెడుకాలం. దీర్ఘ వ్యాధులు ఏమి చేయవు.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)బాధలన్ని తొలగిపోయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. తెలివి బాగా పని చేస్తుంది, సంఘంలో హోదా పెరుగుతుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశవ్యాధులు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. అత్యధిక శ్రమతో అత్యల్పఫలం లభిస్తుంది.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. స్త్రీల మూలకంగా గొడవలు ఉంటాయి. ఆలోచన జ్ఞానం నశిస్తుంది. సంఘంలో కొన్ని ఇబ్బందుల తలెత్తుతాయి.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)ఖర్చులు ఎక్కువకావటం ఋణబాధ, కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. భూ భవనాల వల్ల లాభం ఉంటుంది. దీర్ఘవ్యాధులు తగ్గు ముఖం పడతాయి.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. తండ్రికి అంత మంచి సమయం కాదు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతిచిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. పితృదేవతల అనుగ్రహం బాగా కలిసివస్తుంది. వారి అశీర్వచనంతో అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) ఖరీదైన వాహనాలు కొంటారు. అనేక రంగాల ధనాదాయం వస్తుంది. ప్రయత్నలోపం లేకున్న ఫలితాలు బాగుంటాయి. దొంగతనం జరగవచ్చు. దూరప్రయాణం ఉంటుంది. సంఘంలో హోదా పెరుగుతుంది.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
ఈ సంవత్సరం వృషభరాశివారు దుర్గాదేవి, చండి ఆరాధన చెయ్యాలి. మినుములు 1 ¼ kg దానం. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం నిత్యం పారాయణం చెయ్యాలి. మోపిదేవి సుబ్రమణ్య స్వామికి రుద్రాభిషేకం చేయించాలి.
🎉మిధునరాశి 🎉
మృగశిర 3, 4 పాదములు (కా, కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, చా)
పునర్వసు 1,2,3 పాదములు (కే. కో, హా)
ఆదాయము -8, వ్యయం-11, పూజ్యత -1, అవమానం - 7
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) విద్యారంగంలో రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. తండ్రికి అంత మంచి సమయం కాదు. కొన్ని శుభకార్యక్రమాలు జరుగుతాయి. విపరీతమైన ఖర్చులుంటాయి. ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉంటాయి. అత్యధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనదాయం ఉంటుంది. దృష్టి లోపం కలుగుతుంది. అధికారులతో గొడవలు మనశ్శాంతిని కోల్పోతారు. ఉన్నత పదవులను, సంఘంలో గౌరవాన్ని పొందుతారు. సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )కష్ట నష్టాలు ఏర్పడతాయి. దూర సంచారం వలన ధన వ్యయం కలుగుతుంది. సమయానికి తిండి తినకపోవుట వల్ల వ్యాధులు వచ్చే అవకశం ఉంది. ప్రభుత్వం నుండి ఇబ్బందులుంటాయి.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) కోపం వలన అనవసరంగా గొడవలు, ఉంటాయి. భూ, భవనాల వలన లాభం, సోదరులకు మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యా తరుపున సహాయ సహకారాలు కలసివస్తాయి.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంలో గొడవలు ఉండవచ్చు. ఊహించని రీతిలో ఒక ఖర్చులు ఉంటాయి. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11)పోటీలలో పరిక్షలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలుంటాయి. శారీరక రుగ్మతతో పాటు ఇతరుల వలన భాదలు, ఉంటాయి.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10) దేశ సంచారం వల్ల శారీరక, మానసిక, నలత, ఏర్పడుతుంది. ప్రభుత్వం నుండి ఇబ్బందులుంటాయి. తండ్రికి అంత మంచిది కాదు. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)ఎక్కువ స్థిర చిత్తత ఉండదు. సంతానానికి, తల్లి దండ్రులకు గడ్డు రోజులు, చిన్న చిన్న విషయములకు కూడా కోపపడవలసి వస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)బాధలన్నీ తొలగిపోయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభ కార్యాలు జరుగుతాయి. ఊహించని రీతిలో ఖర్చులుంటాయి.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశవ్యాధులు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా, శ్రవణం ఉంటుంది. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక ఆధోళనకు గురి అవుతారు. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. బంధు వర్గం నుండి ద్వేషం ఉంటుంది.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) ఖర్చులు ఎక్కు కావడం, అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు దూరం, శస్త్ర చికిత్సకు గురి కావచ్చు. ఋణం ఉంటుంది. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. తండ్రికి అంత మంచి సమయం కాదు. కొన్ని శుభకార్యాలు జరగడం, భోజన ప్రాప్తి ఉంటుంది. ధన, నష్టం, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి. 1 ¼ kg కందులు దానంగా ఇవ్వాలి. వెండి సర్ప ప్రతిమ దానంగా ఇవ్వాలి.
🎉కర్కాటకరాశి 🎉
పునర్వసు 4 పాదము (హే)
పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హూ, హే,హో. డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ,డూ,డే, డో)
ఆదాయము 2, వ్యయం- 11, పూజ్యత- 4, అవమానం -7
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) ఖర్చులు ఎక్కువ బంధు మిత్రులతో గొడవలు దూర ప్రయాణం శస్త్రచికిత్స ఋణ బాధలు మానసిక అశాంతి ఆస్తి నష్టం ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం మూలంగా ఇబ్బందులు తొలగవచ్చు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. గాయాలు తగలవచ్చు. ఆహార దోషం, దృష్టి దోషం దగ్గరవారి ఎడబాటు.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )నూతన వాహనాలు కొంటారు. ధనం బాగా వస్తుంది.దొంగతనం జరుగుతుంది. దూర ప్రయాణం చేస్తారు. ఉన్నత పదవులు లభిస్తాయి. తండ్రికి అంత మంచిది కాదు. అనవసరమైన గొడవలలో ఇరుక్కుంటారు.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) అనారోగ్యం, ఊహించని రీతి కష్ట నష్టాలు, దూర సంచారం, ఖర్చులు, శుభ కార్యములకై ఖర్చు ఉంటుంది. అనవసరపు ఖర్చులను ఇస్తాడు. తండ్రికి అంత మంచిది కాదు.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) కోపం, అనవసరంగా గొడవలు ఉంటాయి. దృష్టిలోపం, విరోధం ఉంటుంది. అధికారులతో గొడవలు మనశ్శాంతి కొరవడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వేళకు సరియైన తిండి దొరకదు. నరాలకు సంబంధించిన వ్యాధుల వలన బాధ ఉంటుంది.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11)వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. తండ్రికి అంత మంచిది కాదు. ధనాదాయం బాగా ఉన్నట్లే ఉన్నా ధన నష్టం కూడా ఉంటుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు, సాహస కార్యాలు చేస్తారు. భూ, భవనముల వలన లాభం, సోదరులకు మంచిది. శారీరక రుగ్మతలతో పాటు ఇతరుల వలన బాధలు ఉంటాయి.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)దేశ సంచారం శారీరక, మానసిక నలత ఏర్పడుతుంది. మానసిక అశాంతి ఉంటుంది. తండ్రికి అంత మంచిది కాదు. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)స్థిర చిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రులకు గడ్డురోజులు, చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. ఉద్యోగ భంగం, పనిలో ఎక్కువ అడ్డంకులు ఉంటాయి. జీవితం క్రమ బద్ధంగా సాగదు. అధిక ఖర్చులుంటాయి.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) బాధలన్నీ తొలగిపోయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశవ్యాధులు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవనం ఉంటుంది. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. బంధు వర్గం నుండి ద్వేషం ఉంటుంది. తండ్రికి అంత మంచిది కాదు.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) ఖర్చులు ఎక్కువ కావడం, అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు దూరం. శస్త్ర చికిత్సకు గురి కావచ్చు. ఋణ ఉంటుంది. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. భూ భవనాల మూలంగా లాభం ఉంటుంది.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
శ్రీ కాళహస్తి రాహు, కేతు పూజ చేయించుకొనుట మంచిది. శని కూడా దోషకారి | అగుట వలన నీరసం, పనిలో ఆలస్యం జరుగునప్పుడు శని తైలాభిషేకాలు, | శివాభిషేకాలు చేయించుకొనుట కుజుడు రాశి రాశికి మార్పు చెందినప్పుడు కుజ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ సమయమున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పూజలు, కళ్యాణం దర్శనం మంచి ఫలితాను ఇచ్చును.
🎉సింహరాశి 🎉
మఖ 4 పాదములు (మా, మీ, మూ, మే)
పుబ్బ 1, 2, 3, 4 పాదములు (మో, టా, టీ, టూ)
ఉత్తర 1వ పాదము (టే)
ఆదాయము -5, వ్యయం - 5, పూజ్యత-7, అవమానం – 3
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) అనవసరపు గొడవలు మృతవార్తా శ్రవణం, సంతానానికి ఇబ్బందులు శాంతి లోపం ఉంటుంది. స్త్రీలతో గొడవలు ఉంటాయి. బంధు వర్గంలో విద్వేషాలుంటాయి. అధిక ఖర్చులు ఉంటాయి.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) ఖర్చులు ఎక్కువకావడం, అధికారులతో గొడవలుపడడం, బంధు మిత్రులకు దూరం, కంటి జబ్బులు, పైత్య ప్రకోపం రక్త దోషం. ఉద్యోగ భంగం లేదా అధికారుల నుండి శిక్ష పొందవచ్చు. పనిలో ఎక్కువ అడ్డంకులు ఉంటాయి. అధిక ఖర్చులు ఉంటాయి.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. తల్లికి అంత మంచిదికాదు. వ్యాధులు తీవ్రత తగ్గుముఖం పడతాయి.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం, గాయాలు తగులవచ్చు. దృష్టిదోషం దగ్గరవారి ఎడబాటు, ఖర్చు ఎక్కువ, ఉన్నత పదవులను సంఘంలో గౌరవాన్ని పొందుతారు. పెద్దల అనుగ్రహంతో అన్ని పనులు చక్కగా సాగుతాయి.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) అనారోగ్యం, ఊహించని రీతి కష్ట నష్టములు, దూర సంచారం, ఖర్చులు, గాయాలు తగలవచ్చు. మంచి వాహనాలు కొంటారు. నివాస స్థలానికి దూరంగా సంచరించ వలసి వస్తుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) కోపము, అనవసరంగా గొడవలు ఉంటాయి. దృష్టి లోపం, విరోధం ఉంటుంది. అధికారులతో గొడవలు మనశ్శాంతి కొరవడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వేళకు సరియైన తిండి దొరకదు. నరాలకు సంబంధించిన వ్యాధుల వలన బాధ ఉంటుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10)వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. దూరదేశం నుండి ప్రభుత్వం నుండి గౌరవ మర్యాదలు, సన్మానాలు ఉంటాయి. మంచి వాహనాలు కొంటారు. శారీరక సుఖాలను మెండుగా అందుతాయి. మంచి ధనాదాయం, ఉన్నత పదవులను పొందే అవకాశం కలదు.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్సు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలుంటాయి. శుభకార్యాలు, సాహస కార్యాలు చేస్తారు. భూ, భవనాల వలన లాభ, సోదరులకు మంచిది. ధనాదాయం బాగా ఉన్నట్లే ఉన్నా ధననష్టం కూడా ఉంటుంది. శుభకార్యములకై ఖర్చు ఉంటుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8) దేశ సంచారం, శారీరక, మానసిక నలత, ఏర్పడుతుంది. శాంతి ఉంటుంది. చెడు వ్యవసనాలకు లోను అవుతారు. ఆస్తి చెగిపోవచ్చు. తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు. ప్రమాదాలకు గురి కావడం మరణం వంటి బాధలు ఉంటాయి.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) స్థిరచిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రులకు గడ్డురోజులు, మానసిక అశాంతి ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్యానికి, మేనమామలకు చెడు కాలం, సహాయ సహకారాలు అందించడం, జీవితం మొత్తం క్రమ బద్ధంగా సాగదు. అధిక ఖర్చులు ఉంటాయి.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)బాధలన్నీ తొలగిపోయి. వృత్తి, వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సంతానానికి, మేనమామకు మేలైన కాలం కాదు. విద్య, వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం, పేరు ప్రతిష్టలు పొందుతారు.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) ఎక్కువ గొడవలుంటాయి. జీర్ణకోశవ్యాధులు విభిన్న మార్గాలలో బాధలుంటాయి. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. కోరినవన్ని సమకూరుతాయి.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక వ్యధకు గురి అవుతారు. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. బంధు వర్గం నుండి ద్వేషం ఉంటుంది.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
ఆంజనేయ స్వామికి తమలపాకులు పాకుల దండ సమర్పించాలి. నిత్యం వినాయకుని ఆరాధించాలి 1 ¼ kg నల్ల నువ్వులు, 1 ¼ kg ఉలవలు దానంగా ఇవ్వాలి. సుబ్రమణ్య స్వామికి అభిషేక అర్చనలు చెయ్యడం వలన శుభ ఫలితాలు ఉంటాయి.
🎉కన్యారాశి 🎉
ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)
హస 1, 2, 3, 4 పాదములు (పూ, షం, ణా, రా)
చిత్త 1,2 పాదములు (పే,పో)
ఆదాయము 8, వ్యయం-11, పూజ్యత- 3, అవమానం 3
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) ఆర్ధిక రంగంలోను ఉంటుంది. కుటుంబంలో గొడవలు, జీర్ణకోశ వ్యాధులు ఉంటాయి. ధనాదాయం బాగుండి ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. తల్లికి అంత మంచిదికాదు. అపనిందనలకు గురి అవుతారు. ప్రమాదాలు జరుగవచ్చు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16)అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. ధనాదాయం ఉంటుంది. అనుకొన్నవి సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తులు సమకూరుతాయి. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. బంధు వర్గం నుండి ద్వేషం ఉంటుంది. దేవతల మరియు తల్లి దండ్రుల అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తాడు.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )ఖర్చులు ఎక్కువకావడం, అధికారులతో గొడవలు పడడం, బంధుమిత్రులకు దూరం అవుతారు. పితృ దేవతల మరియు తల్లి దండ్రుల అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తాడు. విద్యార్థనతో పాటు ధన సంపాదనలో ఎలాంటి లోటు ఉండదు. ఆలోచనా జ్ఞానం, నశిస్తుంది.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. అనారోగ్యం వలన భాధలకి గురిఅవతారు. ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. తల్లికి అంత మంచిదికాదు. ఆస్తులు కరగవచ్చు. ప్రమాదాలకు గురికావడం.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం, ఉన్నత పదవులను సంఘంలో గౌరరవాన్ని అందిస్తాడు. సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది. తల్లికి అంత మంచిది కాదు. ఆస్తులు కరుగవచ్చు. పితృదేవతల, అనుగ్రహం బాగా కలసి వస్తుంది. వారి ఆశీర్వచనంతో అన్ని పనులు చక్కగా సాగుతాయి.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) అనారోగ్యం, ఊహించని రీతి కష్టనష్టాలు, దూర సంచారం, ఖర్చులు లాభ కరమైన దూర ప్రయాణాలు చేస్తారు. నివాస స్థలానికి దూరంగా సంచరించ వలసి వస్తుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10)కోపం, గొడవలు ఉంటాయి. ఆహారంలో దోషం, దృష్టి దోషం దగ్గరవారి ఎడబాటు, ఖర్చులు అధికంగా ఉంటాయి. వేళకు సరియైన తిండి దొరకదు. నరాలకు సంబంధించిన వ్యాధులవలన బాధ ఉంటుంది. తల్లికి అంత మంచిది కాదు. భార్యామూలక సహాయసహకారాలు అందివస్తాయి.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)వస్తువలను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. దృష్టి లోపం, విరోధం ఉంటంది. అధికారులతో గొడవలు మనశ్శాంతి కొరవడుతుంది. పదవులను పొందే అవకాశం కలదు. తీవ్రమైన ఆపదలకు గురి అవుతారు.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. శభకార్యాలు, సాహస కార్యాలు చేస్తారు. భూ, భవనముల వలన లాభం, సోదరులకు మంచిది. ధనాదాయం బాగా ఉన్నట్లే ఉన్నా, ధననష్టం కూడా ఉంటుంది. తల్లికి అంత మంచిది కాదు.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) దేశ సంచారం, శారీరక, మానసిక నలత ఏర్పడుతుంది. శుభకార్యాలు, సాహస కార్యాలు చేస్తారు. భూ, భవనాల వలన లాభం, సోదరులకు మంచిది. అధికారులు అనాదరణకు, ఆగ్రహానికి గురి అవుతారు. వృథా ఖర్చులు ఉంటాయి. చెడు వ్యసనాలకు లోనవుతారు. ఆస్తి కరిగిపోవచ్చు తల్లికి అంత మంచిదికాదు.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)స్థిర చిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రులకు గడ్డురోజులు, మానసిక అశాంతి ఉంటుంది. గాయములు మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు. సుఖశాంతులు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు. తల్లి దండ్రులు ఆరోగ్యానికి, మేన మామలకు చెడు కాలం. తల్లికి అంత మంచిదికాదు.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) బాధలన్నీ తొలగిపోయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తెలివి బాగా పని చేసినా, ధన సంపాదన విషయంలో అంత మంచి ఫలితాలుండవు. సంతానానికి, మేనమామకు మేలైన కాలం కాదు. తల్లికి అంత మంచిదికాదు.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశవ్యాధులు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. శుభ ఫలితాను ఇస్తాడు. కోరినవన్ని, సమ కూరుతాయి. ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
ఈ సంవత్సరం ఈ రాశివారికి. కందులు మంగళవారం 1 ¼ kg గోధుమలు 1 ¼ kg దాన. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ దర్శనమ్మ,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు.
🎉తులారాశి 🎉
స్వాతి 1, 2, 3, 4 పాదములు (రూ, రే, రో, త)
విశాఖ 1, 2, 3 పాదములు (తీ, తూ, తే)
ఆదాయము-5, వ్యయం-14, పూజ్యత-6, అవమానం-3
తులారాశి గ్రహ సంచార సారాంశము
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) బాధలు తగ్గి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ధన సంపాదన బాగానే ఉంటుంది. సంతానానికి మేనమామలకి మంచి కాలం కాదు. క్రమం క్రమంగా చికాకు పెరుగుతుంది. తల్లిదండ్రుల అనుగ్రహం ఉంటే ఇబ్బందుల నుండి తప్పుకోవచ్చు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16)ఎక్కువ గొడవలు ఉంటాయి. ప్రయత్న లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దొంగతనం జరుగవచ్చు. దూర ప్రయాణం ఉంటుంది.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )అనవసరపు గొడవలు ఉంటాయి. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. బంధు వర్గం నుండి ద్వేషం ఉంటుంది. ప్రతి చిన్న విషయం భూతం లాగా భయపెడుతుంది.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. ధనాదాయం ఉంటుంది. అనుకొన్నవి సాధిస్తారు. దూర ప్రయానాలు లాభసాటిగా ఉంటాయి. పితృ దేవతల మరియు తల్లి దండ్రుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ప్రతి చిన్న పనికి శ్రమ పడవలసి ఉంటుంది. తల్లికి అంత మంచిది కాదు. భార్య మూలకంగా సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని ఇబ్బందులు పడిన ఈ నెల బాగానే ఉంటుంది.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనా దాయం ఉంటుంది. అనారోగ్యం సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ఉన్నత పదవులను వలన సంఘంలో గౌరవాన్ని అందిస్తారు. సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10) ఊహించని రీతి కష్టనష్టాలు ఉంటాయి. విద్యా, వినోద, కార్యక్రమలలో పాల్గొంటారు. పితృ దేవతల మరియు తల్లి దండ్రుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)కోపం వల్ల అనవసరంగా గొడవలు ఉంటాయి. గాయాలు తగులవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వేళకు సరియైన తిండి దొరకదు. భార్యామూలక సమాయ సమకారాలు అందివస్తాయి.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంలో గొడవలు ఉంటాయి. అధికారులతో గొడవలు మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. మీ పని చురెకుగా సాగదు. ధనవ్యయం, దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలుంటాయి.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్ సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్జనతో పాటు ధన సంపాదనలో ఎలాంటి లోటు ఉండదు. విద్యారంగంలో రాణింపు ఉంటుంది. మేనమామకు అంత మంచిది కాదు.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)దేశ సంచారం, శారీరక, మానసిక నలత, ఏర్పడుతుంది. శుభకార్యాలలో సాహస కార్యాలు చేస్తారు. భూ భవనాలు వలన లాభం, సోదరులకు మంచిది. అధికారులు అనాదరణకు, ఆగ్రహానికి గురి అవుతారు. ఉద్యోగంలో, రాజకీయాలలో బాగా రాణిస్తారు.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) స్థిరచిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రులకు గడ్డు రోజులు, మానసిక అశాంతి ఉంటుంది. మిత్రులు కూడా శతృవుల వలె ప్రవర్తిస్తారు. సుఖ శాంతులు లభిస్తాయి.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపపడవలసి వస్తుంది. సంతానానికి, మేనమామకు మేలైన కాలం కాదు. ఉద్యోగంలో రాజకీయాలలో బాగా రాణిస్తారు. విద్యార్జనతో పాటు దనసంపాదనలో ఎలాంటి లోటు ఉండదు.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
దుర్గా దేవిని ఆరాధించాలి, 1 ¼ kg ఉలవలు, 1 ¼ కి మినువులు దానంగా ఇవ్వాలి. శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతూ పూజ చేయించాలి. సుబ్రమణ్య స్వామి ఆరాధన చెయ్యాలి.
🎉వృశ్చికరాశి 🎉
విశాఖ 4 పాదము (తో)
అనూరాధ 1, 2, 3, 4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1, 2, 3,4 పాదములు (నో,యా,యీ,యూ)
ఆదాయము - 11, వ్యయం 5, పూజ్యత - 2, అవమానం- 6
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) స్థిర చిత్తం ఉండదు. సంతానానికి తల్లి దండ్రులకు గడ్డు రోజులు. మిత్రులతో విభేదం వస్తుంది. విద్యా, వైజ్ఞానిక రంగాలలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి విజయాన్ని సాధిస్తారు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16)బాధలన్నీ తొలగిపోయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం ఉంటుంది. తెలివిగా పనిచేసినా ధన సంపాదన లభిస్తుంది. కొన్ని శుభకార్యాలు విషయంలో అనుకూల ఫలితాలు ఉండవు.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. తండ్రికి అంత మంచి సమయం కాదు. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. శుభఫలితాలను ఇస్తాడు.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణ ఉంటుంది. ప్రయత్న లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దొంగతనం జరగవచ్చు
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12)ఖర్చులు ఎక్కువ కావడం. అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు సహాయసకరాలు అందుతాయి.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ధనాదాయం ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తులు సమకూరతాయి. వ్యాధులు తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. ఉన్నత పదవులను పొందుతారు. సంఘంలో గౌరవాన్ని అందిస్తారు. సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)అనారోగ్యం, ఊహించని రీతి కష్ట నష్టాలు, దూర సంచారం, ఖర్చులు, ఎక్కువావుతాయి. అనారోగ్యం వల్ల తీవ్ర భాధకు గురిఅవుతారు. నివాస స్థలానికి దూరంగా సంచరించవలసి వస్తుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8)కోపం, అనవసరంగా గొడవలు ఉంటాయి. గాయాలు తగులవచ్చు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం, విదేశీ వాసం, అధికారుల ఆగ్రహానికి గురికావడం. కళ్ళ నొప్పులు, పశువుల వలన కీడు, అవమానం, అపనిందలు పడటం వంటివి జరుగుతాయి.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. సంతానానికి చింత ఉంటుంది.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన పలితాలు ఉంటాయి. దృష్టిలోపం, విరోధం, ఉంటుంది. అధికారులతో గొడవలు మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. విద్యా రంగంలో రాణింపు ఉంటుంది.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) దేశ సంచారం, శారీరక, మానసిక, నలత, ఏర్పడుతుంది. శుభకార్యాలు, సాహస కార్యాలు చేస్తారు. భూ, భవనాల వలన లాభం, సోదరులకు మంచిది. అధికారుల అనాదరణకు, ఆగ్రహానికి గురి అవుతారు.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) స్థిర చిత్తత ఉండదు. సంతానానికి తల్లిదండ్రులకు గడ్డు రోజులు, మానసిక అశాంతి ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్యానికి, మేన మామలకు చెడు కాలం.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
ద్రాక్షరామం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి 1 1/4 కేజీ గురువారం శివాలయంలో శనగలు దానంగా ఇవ్వాలి ప్రతినిత్యం శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం మంచిది. శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజ చేయించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
🎉ధనస్సురాశి 🎉
మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బి)
పూర్వాషాడ 1,2,3,4 పాదములు (బూ.దా.భా.ఢా)
ఉత్తరాషాడ 1 పాదము (బే)
ఆదాయము-14, వ్యయం-11, పూజ్యత- 5, అవమానం-6
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) దేశ సంచారం శారీరక నలత సోదరులతో మంచి అనుబంధం, వృధా ఖర్చులు గృహ నిర్మాణం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కొంత వరకు ఇబ్బందులు ఉండవు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16)స్థిర చిత్తత ఉండదు. సంతానానికి తల్లి దండ్రులకు గడ్డు రోజులుగా ఉంటాయి. ఋణ భాదలు కలుగుతాయి. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. విదేశీవాసం, అధికారుల ఆగ్రహమునకు గురిఅవ్వుతారు.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 ) బాధలన్నీ తొలగిపోయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. అనారోగ్యన్నికి గురిఅవుతారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు, విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. తండ్రికి అంత మంచి సమయం కాదు. గృహ నిర్మాణం మొదలు పెట్టె అవకశం ఉంటుంది. నాలుగు వైపుల నుండి రాబడి ఉంటాయి. విద్య, వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం పేరు ప్రతిష్ఠలు ఉంటాయి.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12)అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. తండ్రికి అంత మంచి సమయం కాదు. గౌరవ మర్యాదలు నశిస్తాయి.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) ఖర్చులు ఎక్కువ కావడం. అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు దూరం, ప్రయత్న లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దొంగతనం జరగవచ్చు. దూర ప్రయాణం ఉంటుంది. అవమానము అపనింద ఉంటుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. ప్రయత్న లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దొంగతనం జరగవచ్చు. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడతాయి. వార సత్వముగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తులు సమకూరుతాయి. ఉన్నత పదవులను, సంఘంలో గౌరవాన్ని అందిస్తాడు. సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8) అనారోగ్యం వల్ల ఊహించని రీతి కష్ట నష్టాలు ఉంటాయి. దూర సంచారం, ఖర్చులు ఎక్కవ అవుతాయి. భార్యా మూలక సహాయ సహకారాలు అందివస్తాయి. వాహన పశు సంపద కలుగుతుంది.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) కోపం, అనవసరంగా గొడవలు ఉంటాయి. వేళకు సరియైన తిండి దొరకదు. నరాలకు సంబంధించిన వ్యాధుల వలన బాధ ఉంటుంది.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. గాయాలు తగులవచ్చు. ఆహారంలో దోషం, దృష్టి దోషం, ఉన్నత పదవులు పొందడం ఉంటుంది. అధికారుల ఆగ్రహంకు గురిఅవుతారు.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలుంటాయి. అధికారులతో గొడవలు మనశ్శాంతి కొరవఅతుంది. ధనా దాయం బాగా ఉన్నట్లే ఉన్నా ధననష్టం కూడా ఉంటుంది. శారీరక రుగ్మతతో పాటు ఇతరుల వలన బాధలు ఉంటాయి.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) దేశ సంచారం, శారీరక, మానసిక నలత, ఏర్పడుతుంది. భూ, భవనాల వలన లాభం వస్తుంది. సోదరులకు మంచిది. అధికారులు అనాదరణకు, ఆగ్రహానికి గురి అవుతారు.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
దుర్గా శివ స్తోత్రములు శనీశ్వర స్వామికి తైలాభిషేకం నల్ల నువ్వులు 1 ¼ kg దానం. గురువారం శనగలు 1 ¼ kg దానం శ్రీశైలం క్షేత్ర దర్శనం రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు.
🎉 మకరరాశి 🎉
ఉత్తరాషాడ 2,3, 4 పాదములు (బో,జా,జి)
శ్రవణం 1, 2, 3, 4 పాదములు (జూ,జే, జో, ఖా)
ధనిష్ఠ 1,2 పాదములు (గా.గీ)
ఆదాయము 02, వ్యయం- 8, పూజ్యత- 1, అవమానం 2
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) పోటీలలో విజయం లభిస్తుంది. అధికారులతో గొడవ ఉంటుంది. ధనం ఖర్చు బాగా అవుతుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆర్థిక ఇబ్బంది అంతగా ఉండదు.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) దేశ సంచారం, శారీరక, మానసిక నలత, ఏర్పడుతుంది. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. అధికారులు ఆగ్రహానికి గురి అవుతారు. సంతాన మూలక ఆనందం ఉంటుంది.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )స్థిరచిత్తత ఉండదు. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. మేనమామలకు చెడుకాలం. మంచి అభివృద్ధిని పొందుతారు. వాహన పశుసంపద కలుగుతుంది.
భిస్తుంది. ఋణ భాదలు కలుగుతాయి. సంతానానికి మేనమామకు మైలైన కాలం కాదు. వాయు సంబంధమైన రోగాల వలన బాధలుంటాయి.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12)ఎక్కువ గొడవలు ఉంటాయి. విద్య, వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం వస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్త, శ్రవణం ఉంటుంది. తండ్రికి అంత మంచి సమయం కాదు. ప్రతి చిన్న విషయం భూతం లాగా భయపెడుతుంది. గౌరవ మర్యాదలు నశిస్తాయి. పదోన్నతి పెరుగుతుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10)ఖర్చులు ఎక్కువ కావడం, అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు దూరం అవుతారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9)విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. ప్రయత్న లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దొంగతనం జరుగవచ్చు. దూర ప్రయాణం ఉంటుంది. గృహ నిర్మాణం చేపడతారు. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తులు సమకూరుతాయి. ఉన్నత పదువులను, సంఘంలో గౌరవాన్ని పొందుతారు.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) అనారోగ్యం, ఊహించని రీతిలో కష్ట నష్టంలు ఉంటాయి. అనుకొన్నవి సాధిస్తారు. భార్యా మూలక సహాయ సహకారాలు అందివస్తాయి. వాహన పశుసంపద కలుగుతుంది.
పుష్య మాసం: (జనవరి-8 -2027 to ఫిబ్రవరి 6 -2027)కోపం, అనవసరంగా గొడవలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వేళకు సరియైన తిండి దొరకదు.
మాఘ మాసం:(ఫిబ్రవరి- 7-2027 to మార్చ్ 8-2027) వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. ఆహారంలో దోషం ఉంటుంది. పదోన్నతి పెరుగుతుంది.
ఫాల్గుణ మాసము: (మార్చ్ 9-2027 to ఏప్రియల్ 6-2027) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్కు సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. విద్యా రంగంలో రాణింపు ఉంటుంది. మంచి అభివృద్ధి వస్తుంది.
ఈ రాశివారి సమస్యలకు పరిష్కారం:-
హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి 1 ¼ kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. నిత్యం శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యాలి. ద్రాక్షారామం శివాలయంలో ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చేయించాలి.
🎉 కుంభరాశి 🎉
ధనిష్ట 3, 4 పాదములు (గూ,గే,)
శతభిషం 1, 2, 3, 4 పాదములు (గో,సా,సీ,సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదము (సే,సో,దా)
ఆదాయము - 02 వ్యయం 8 పూజ్యత- 4 అవమానం 2
చైత్ర :(మార్చ 19 to ఏప్రియల్ 17 ) వస్తువులు కొంటారు. కళత్రంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రమాదాలను తప్పించుకుంటారు. అప్పులు తీరుస్తారు. సంతానంమూలకంగా ఆనందం పొందుతారు. విద్యలో రాణిస్తారు. ఉన్నత పదవులు కలుగుతాయి.
వైశాఖ :(ఏప్రియల్-18 to మే-16) పోటీలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్కు, సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ధనాదాయం బాగా ఉన్నట్లే ఉన్నా ధననష్టం కూడా ఉంటుంది.
అధిక జ్యేష్ఠ మాసం: (మే-17 to జూన్-15 )దేశ సంచారం, శారీరక, మానసిక నలత, ఏర్పడుతుంది. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అధికారులు అనాదరణకు, ఆగ్రహానికి గురి అవుతారు. విద్యా రంగంలో రాణింపు ఉంటుంది.
నిజ జ్యేష్ట మాసము:(జూన్-16 to జూలై-14) స్థిర చిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రులకు గడ్డు రోజులు, సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. సుఖశాంతులు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు. తల్లి దండ్రులకు అత్యధికంగా ఖర్చులు ఉండవచ్చు.
ఆషాఢమాసం:(జూలై-15 to ఆగష్టు-12) బాధలన్ని తొలగిపోయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అపుతారు. తెలివి బాగా పని చేసినా, ధన సంపాదన విషయంలో అంత మంచి ఫలితాలుండవు.
శ్రావణ మాసం:(ఆగష్టు13-to సెప్టెంబర్-11) గొడవలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు విభిన్నమార్గాలలో బాధలు ఉంటాయి. ఋణ భాదలు ఉంటాయి. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. శుభ ఫలితాలను ఇస్తారు. ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది.
భాద్రపద మాసం: (సెప్టెంబర్ 12 to అక్టోబర్ 10)అనవసరపు గొడవలు, సంతానానికి చేటు, మృత వార్తా శ్రవణం ఉంటుంది. శస్త్ర చికిత్సకు గురి కావచ్చు. ఋణం ఉంటుంది. కళత్రానికి అనారోగ్య బాధ ఉంటుంది. స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. సంతాన మూలక ఆనందం ఉంటుంది.
ఆశ్వీయుజ మాసం:(అక్టోబర్-11 to నవంబర్-9) ఖర్చులు ఎక్కువ కావడం, అధికారులతో గొడవలు పడడం, బంధుమిత్రులకు దూరం అవుతారు. వాయు సంబంధమైన రోగాల వలన బాధలుంటాయి.
కార్తీక మాసం: (నవంబర్ - 10 to డిశంబర్-8) విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ప్రయత్నలోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది. పితృదేవతల, అనుగ్రహం బాగా కలసి వస్తుంది. వారి ఆశీర్వచనంతో అన్ని పనులు చక్కగా సాగుతాయి. వివాహం, సంతానం ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఘోరమైన ఆపదలను కూడా కలిగిస్తాడు.
మార్గశిర మాసం:(డిశంబర్-9 to జనవరి 7 -2027) ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు. అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది. ప్రయత్నం లోపం లేకున్నా ఫలితలోపం ఉంటుంది. దూర ప్రయాణం ఉంటుంది. ఉన్నత పదవులను, సంఘంలో గౌరవాన్ని అందిస్తాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.