ఆ రాశి నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది

Today Astrology In Telugu. సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దగ్గరి వారి నుండి సమయానికి

By జ్యోత్స్న  Published on  12 Aug 2022 11:30 PM GMT
ఆ రాశి నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది

మేషం

సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది.దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

వృషభం

వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.

మిధునం

స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు.

కర్కాటకం

కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

సింహం

వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంఘంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు.

కన్య

ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమయానికి తగిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

తుల

వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాల ఆలోచనలో స్థిరత్వం ఉండదు. గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది.

వృశ్చికం

అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు

వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

మకరం

సమయానికి నిద్రహారాలు ఉండవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

కుంభం

సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం

ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.


Next Story
Share it