వార ఫలాలు : తేదీ 13-12-2020 నుంచి 19-12-2020 వరకు

Raasipalalu. ఈ రాశి వారికి ఈ వారం అంతగా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. గత వారంలో మీకు కనిపించిన ఆరోగ్య అననుకూలత

By Medi Samrat  Published on  13 Dec 2020 6:00 AM GMT
వార ఫలాలు : తేదీ 13-12-2020 నుంచి 19-12-2020 వరకు

*తే. 13-12-2020 ది. ఆదివారం *మాస శివరాత్రి

ఈరోజు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి ప్రవేశం అనగా 12 గంటల నుంచి 12-48 నిమిషాల వరకు సాధకులు లేదా ధర్మబద్ధమైన కోరిక ఉన్నవాళ్లు ధ్యానంలో ఉండటం మంచిది.

*తే. 14-12-2020 ది. సోమవారం *అయిదవ సోమవారం*.

*అమావాస్య సోమవారం లక్ష్మీదేవి వ్రతం చేయడం శుభప్రదం.*

*తే. 15-12-2020 ది మంగళవారం. (సోమవారం తెల్లవారు ఝామున *పోలి స్వర్గము* నకు చేరినది తెల్లవారితే మంగళవారం).*

తే. 15-12-2020 మంగళవారం ఈరోజు నుండి *ధనుర్మాసం ప్రారంభము.* ఈరోజు నదీ స్నానము ప్రశస్తమైనది.

ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన *మార్గశిరమాసము* మరియు ధనుర్మాసం కావున విష్ణు సహస్రనామం పారాయణ చాలా ఉపయుక్తము.

తే 16-12-2020 మార్గశిర శుద్ధ విదియ బుధవారం ఈరోజు *చంద్ర దర్శనం* చేయడం చాలా మంచిది తే19-12-2020 శనివారం *నాగపంచమి* మూలా నక్షత్రం కూడా కలవడం వల్ల విశేషం ఫలితాన్నిస్తుంది సుబ్రహ్మణ్య పూజకు చాలా మంచిది.

తే 21-12-2020 సుబ్రహ్మణ్యం షష్ఠీ దీనినే స్కంద షష్టి అని, సుబ్బారాయుడి షష్టి అని అంటాము. దాంపత్య అనుకూలత,వివాహ దోష నివారణ, ఋణ బాధ నివృత్తికి సుబ్రహ్మణ్యషష్ఠీ పూజ మంచిది.

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం అంతగా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. గత వారంలో మీకు కనిపించిన ఆరోగ్య అననుకూలత ఈ వారం కాస్త సర్దుకుంటుంది. వారం మధ్యలో మారుతున్న రవి బుధులు సైతం మీకు అంతగా అను అనుకూలించే అవకాశం కనపడటం లేదు. రాజకీయ చిక్కులు, చోర బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే శుక్ర గ్రహ స్థితి వలన మీకు భూ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. మారుతున్న రవి మీకు ఏ విధమైన సహాయాన్ని చెయ్యలేడు అంతేకాకుండా ఎంత కష్టపడ్డా తగినంత ఫలితం లేని స్థితిని మీరు ఈ వారంలో అనుభవిస్తారు. కానీ చేసిన కృషి ఎప్పటికీ పోదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందడుగు వేయండి.ఈవారం మీకు 20 శాతం మాత్రమే అనుకూలత ఉంది. భగవదనుగ్రహం పొందడం ద్వారా మీరు చేయబోయే కార్యాలకు కలిగే విఘ్నాలను తొలగించుకొని గలరు. అశ్వినీ నక్షత్రం వారికి మిత్ర తార అయ్యింది కాబట్టి కాస్త అనుకూలంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి నైధన తార అయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. కృత్తికా నక్షత్రం వారికి సాధన తార అయ్యింది కాబట్టీ అనుకున్న పనులు నెరవేరుతాయి

పరిహారం: రవికి సూర్యనమస్కారాలు చేయడం, గురు గ్రహానికి సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం మంచి ఫలితాలు ఇస్తాయి.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈ వారం కూడా విశేష ధన లాభం ఉంది. కుజ, బుధ,గురుల కారణంగా చేసే ప్రతి పనిలోనూ మీకు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఇందుకు . అయితే శుక్రుడు, రవి మీకు అనారోగ్య కారకులు అవుతున్నారు. కాబట్టి మీరు సంపాదించిన దానిలో అధిక భాగాన్ని మీ అనారోగ్యం కోసమే ఖర్చు పెట్టే పరిస్థితి రావచ్చు. మీ ఒక్కరి ఆరోగ్యమే కాదు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే శని రాహు కేతువులు కూడా మీకు భయాన్ని కలిగించేట్టుగా కనిపిస్తోంది. వీలైనంత వరకు ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్యనైనా భగవదనుగ్రహం తో పరిష్కరించుకోవచ్చు అన్న మాటను మనసులో పెట్టుకుని ముందడుగు వేయండి. మొత్తానికి మీకు ఈ వారంలో 38 శాతం అనుకూలత వుంది. కృత్తికా నక్షత్రం వారికి వారికి సాధన తార కాబట్టి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వారికి నైధనతార అయ్యింది కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది..మృగశిర నక్షత్రం వారికి క్షేమ తార కావున కొత్త కార్యక్రమాలను ప్రారంభించటానికి అనుకూలం.

పరిహారం: నవగ్రహ హోమం చేయించండి అన్ని విధాలా అనుకూలంగా మంచి జరుగుతుంది.

మిధున రాశి:

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల కారణంగా కొంత విచారాన్ని పొందుతారు. మనసు స్థిమితంగా ఉండదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు కాస్త ఇబ్బందులు పడతారు అయితే ఇవన్నీ తాత్కాలికం. ఆరోగ్యం కోసం మీరు కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. కుజ, బుధ, కేతులు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. కుటుంబంలోని స్త్రీ ల కారణంగా మీరు ఒక మాట పడాల్సి వస్తుంది. ఈ సమస్యను పెద్దగా చూడనప్పుడుమాత్రమే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీకు ఈ వారం 45% శుభ పరిణామాలు ఉన్నాయ. మృగశిర నక్షత్రం వారికి క్షేమ తార కావున ఈ వారం ప్రశాంతంగా మొదలవుతుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి విపత్ తార అయ్యింది కావున కలహములకు, అపార్థములకు అవకాశం ఉంది. పునర్వసు మొదటి మూడు పాదాలవారికి సంపత్ తార కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది

పరిహారం: రవికి సూర్యనమస్కారాలు, శనికి జపం చేయించటం ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొంద గలుగుతారు.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికంగా గాని కుటుంబ పరంగా గానీ అన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. పుణ్య కార్యాలలో పాలుపంచుకుంటారు. గురు రాహువులు మీకు సౌఖ్యాన్ని ధన లాభాన్ని కలిగిస్తారు. శని కేతు లు మీకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసినప్పటికి ఇతర గ్రహాల శుభ దృష్టి వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. వారం మధ్యలో మారుతున్న రవి మీ శత్రువులను నాశనం చేసే మార్గం చూపిస్తాడు. మీకు ఈ వారంలో అత్యధికంగా 54 శాతంశుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. పునర్వసు నాలుగో పాదం వారికి సంపత్ తార అయ్యింది కాబట్టి ఆర్ధికంగా లాభదాయకం. పుష్యమి నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది కాబట్టి అనారోగ్య హేతువు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార కావున అనుకూలంగా ఉంది

పరిహారం :- అభిషేకం చేయించుకోండి చేసుకోండి. సర్పసూక్త పారాయణ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహరాశి:

ఈ రాశి వారు ఈ వారం పెద్ద అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న అనారోగ్యాల విషయంలో సైతం అప్రమత్తంగా ఉండండి. ఆర్ధికపరమైన లాభం ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసమే దానినే ఖర్చు పెట్టవలసి వస్తుంది అంతే కాదు ఈ ప్రభావం మనసుపై కూడా పడి విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. కుటుంబములోని బాధ్యత గల స్త్రీ ల ద్వారా మీరు కాస్త ప్రశాంతతని పొందుతారు. మీకు ఈ వారంలో 27% శుభ ఫలితాలు ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయ్యింది కాబట్టి కార్యాలన్ని సానుకూలంగా జరిగిపోతాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు మిత్ర తార తో ప్రారంభమైంది కాబట్టి సుఖ సంతోషాలతో ఉంటారు. ఉత్తర ఒకటో పాదం వారికి సాధన తార కాబట్టి కార్య సాధన జరుగుతుంది.

పరిహారం:- సూర్య నమస్కారాలు చేయండి. యోగ సాధన ద్వారా మాససిక ప్రశాంతనను పొందగలరు.

కన్యారాశి:

ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా పురోగమిస్తున్నారు. వార ప్రారంభం లో శారీరక ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. శత్రువులు పెరుగుతారు అయితేనేం. మీకు ఎప్పటిలాగే శత్రు జయం. కానీ ఈ సంఘర్షణ వల్ల కొంత మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మరోవైపు ఇంట్లోని పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. ఈ రాశివారికి ఈ వారంలో 45 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి నైధన తార కాబట్టి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. హస్త నక్షత్రం వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.చిత్త 1 2 పాదాల వారికి క్షేమ తార కాబట్టి అంతా బాగానే ఉంటుంది.,

పరిహారం : రవికి సూర్య నమస్కారాలు. కుజ గ్రహ జపం మంచి ఫలితాలు ఇస్తాయి.

తులరాశి:

ఈ వారం మీరు మానసికంగా కంటే శారీరికంగానే ఎక్కువ ఇబ్బందులు పొందుతారు. శని గ్రహస్థితి మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శత్రు పీడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వీటికి తోడు మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండటంతో విపరీతమైన వత్తిడికి గురై అకారణ కలహాలకు దారితీస్తుంది. అయితే అనుకోని కారణాల వలన ఈ వారం మీకు ఆభరణాలు లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండటం అవసరం అదీ ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో. మీకు ఈ వారంలో 36 శాతం శుభములు ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి కాస్త పరవాలేదు. స్వాతి నక్షత్ర జాతకులకు విపత్ తార అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. విశాఖ1 2 3 పాదాల వారికి మాత్రం సంపత్తార అయింది కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది.

పరిహారం: బుధవారం నాడు విష్ణు సహస్ర పారాయణం చేసి, నానబెట్టిన పెసలు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆనందంగా గడుపుతారు. రవి రాహువుల స్థితి వలన శత్రు మూలమైన భయం వెంటాడుతూ ఉంటుంది. ఆదాయం ఉంటుంది కానీ అంతకు అంతా ఖర్చుఅయిపోతూనే ఉంటుంది. చాలా పనులలో మీకు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. అయినా సరే మీరు నిరుత్సాహ పడకుండా ముందుకు వెళ్లడం ద్వారా భవిష్యత్తులో అయినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. మీకు ఈ వారంలో 45% శుభఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వారికి సంపత్ తార అయింది కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తత వహించడం మంచిది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార కాబట్టి అంతా అనుకూలంగానే ఉంటుంది

పరిహారం :- మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజ, సుబ్రహ్మణ్య పూజ చేయండి. వీలైతే సర్ప సూక్త పారాయణ చేయిస్తే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

ధను రాశి:

ఈ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఈవారం మీకు మార్పును సూచిస్తుంది అయితే ఆ మార్పు మీకు అంతగా అనుకూలించే లా కనిపించడం లేదు. అంతేకాదు కనబడని శత్రువు మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయితే భగవంతుని కృప వలన మీరు వీటన్నింటినీ దాటుకుని రాగలరు. మీకు చేసే పనిలో ఉత్సాహం ఇవ్వబోతున్నాడు. అలాగే రాహువు కూడా మీకు సుఖమయమైన జీవితాన్ని ఇస్తాడు. మీకు 36% శుభఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది పనులన్ని చాలా చక్కగా ఇతరుల సహాయంతో నెరవేరుతాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి సాధన తార అయింది కాబట్టి చేసిన పనులు పూర్తిగా నెరవేరుతాయి.

పరిహారం :- శని స్తోత్ర పారాయణ, కుజుడికి జపం మీకు చాలా అనుకూలిస్తాయి.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అంత అద్భుతంగా లేకపోయినప్పటికీ సర్వ భోగాలను అనుభవిస్తారు. బుధ, శనులు కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఉన్నప్పటికీ గురు శుక్రులు లాభిస్తారు. ఈవారం మీకు స్థానచలనం ఉంది అయితే అది మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు సరికదా లాభాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం 45 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టే అనుకూలత ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకివారికి ప్రత్యక్ తార కాబట్టి జాగ్రత్త వహించాలి. ధనిష్ట 1 2 పాదాలు తార కాబట్టి క్షేమ తార అయింది కాబట్టి అంతా శుభాకరం గా ఉంటుంది.

పరిహారం :- శని, కుజ జపాలు చేయించండి.

కుంభ రాశి:

ఈ రాశివారికి ఈ వారం కూడా ఆనందంగా సంతోషంగా గడుస్తుంది. రవి మీకు ధన లాభన్ని కలిగిస్తుండగా బుధుడు ఆనందాన్ని ఇవ్వనున్నాడు. ధననష్టం స్థానచలనం ఉన్నప్పటికీ భగవదనుగ్రహం వల్ల మీరు అన్నింటిని ఎదురు కొనగలరు. గౌరవానికి భంగం వాటిల్లుతుంది ఏమైనా సరే మీరు మాట మీద నిలబడటం ద్వారా మంచి భవిష్యత్తును చూడబోతున్నారు. మీకు ఈ వారంలో 45 శాతం శుభ పరిణామాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి క్షేమతార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. శతభిషం నక్షత్ర జాతకులకు విపత్ తార అయింది. కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందడం కష్టం. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది.

పరిహారం :- ఈ వారం కూడా మీరు అమ్మవారిని నమ్ముకోండి సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ లలితా సహస్రనామ పారాయణ చేయండి.

మీన రాశి :- ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకున్న కోరికలు నెరవేర తాయి. ఈ వారంలో మారనున్న రవి మీకు కార్య జయాన్ని కలిగించనున్నాడు. ఇక బుధ, గురులు మీకు సంతోషాన్ని లాభాన్ని ఇవ్వనున్నారు . శుక్రుడు శని కూడా మీకు ధనధాన్య వృద్ధిని కలిగించడం మిమ్మల్ని మరింత మంచి స్థితిలో ఉండేలా చేస్తుంది. మీకు ఈ వారంలో అత్యధికంగా 72 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి సంపత్ తార అయింది కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు జన్మతార తో వారం ప్రారంభం కాబట్టి అనారోగ్య సూచన ఉందితార. రేవతీ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార అయింది కాబట్టి అంతా శుభమే జరుగుతుంది.

పరిహారం :- సర్ప సూక్త పారాయణ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది


Next Story