వార ఫలాలు : 30-05-2021 నుండి 05-06-2021 వరకు

Raasi Palalu. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. తెలివి తేటలతో వ్యవహరించి ఇంటబయట అందర్

By జ్యోత్స్న  Published on  30 May 2021 4:59 AM GMT
వార ఫలాలు : 30-05-2021 నుండి 05-06-2021 వరకు

మేషం రాశి:

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. తెలివి తేటలతో వ్యవహరించి ఇంటబయట అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందుకంటే మెరుగవుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తీరుతాయి. గృహమున శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నష్టాల నుండి కొంత వరకు బయటపడతారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారంతమున స్వల్పఅనారోగ్యం సమస్యలు ఉంటాయి. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది.

పరిహారం : మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితలు పొందుతారు.

వృషభ రాశి :

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఆర్ధిక విషయాలు సంతృప్తిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొని పెద్దల మన్ననలను అందుకుంటారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి ఉన్నత అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి:

పాత మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమౌతాయి. పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో మనస్పర్ధలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరులతో వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలను గురించి చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు పునః ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆర్థిక పురోగతి పొందుతారు అన్ని రంగాల వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. వారం మధ్యలో చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఊహించని ఖర్చులుంటాయి.

పరిహారం : గణపతి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం రాశి:

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూరప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. దూరపు బంధువుల వియోగం బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు విషయంలో లోటు పాట్లు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు భాధ్యతలుంటాయి. అన్ని వర్గాల వారికి చికాకులు తప్పవు.వారాంతమున నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్వల్ప ధనలాభ సూచనలున్నవి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక వివాదాలలో విజయం సాధిస్తారు నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్ధిక లాభాలు కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తి కరంగా సాగుతుంది. బంధుమిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారాంతంలో బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయట పడతారు. ఇంట బయట స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ విషయమై ప్రతిబంధకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధనసహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సంఘంలోవిశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి లాభాల అందుకుంటారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో సమస్యలు నుండి బయటపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారాంతమున బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ధనవ్యయం సూచనలు ఉన్నవి.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

ఇంటా బయటా చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. దూరపు బంధువులు నుండి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు సంతానం విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు పొందుతారు వారం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శిరో బాధలు పెరుగుతాయి.

పరిహారం : వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవాంతరాలు తొలగుతాయి.వ్యాపార వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరించి మంచి లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారం మధ్యలో ఇతరులకు ధన విషయంలో ఇతరులకు మాటఇచ్చి ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

పరిహారం : సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సంతానం విద్యా విషయాలలో శుభ వార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగ పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆప్తుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. ఋణ బాధలు తొలగుతాయి.చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది.

పరిహారం : ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీనం రాశి:

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కీలక వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలిసివస్తాయి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయటా పరిచయాలు అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారు విశేషమైన ఆదరణ పొందుతారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలుఉంటాయి.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.


Next Story