వార ఫలాలు : ది. 28-03-2021 నుండి ది. 03-04-2021 వరకు

March Last Week Astrology. వార ఫలాలు : ది. 28-03-2021 నుండి ది. 03-04-2021 వరకు

By Medi Samrat  Published on  28 March 2021 4:19 AM GMT
March Last Week Astrology.

వారంలో ముఖ్యం అయిన రోజులు

28-03-2021 - హోలీ

29-03-2021 - వసంతోత్సవం

మేషం రాశి:

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. తెలివితేటలను ఉపయోగించి ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. శుభకార్యాలకు ధన వ్యయం అవుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరతాయి. నూతన వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

పరిహారం: మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వృషభ రాశి :

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. ఇతరులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు సహకారమౌతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున విధులు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయ సంబంధిత ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి ఇబ్బందులు ఉంటాయి.

పరిహారం: రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిధున రాశి:

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. నూతన వ్యాపారాలకు ఊహించని విధంగా పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయట పడతారు. ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం మధ్యన సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

పరిహారం :ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :

ఇంటాబయటా సమస్యలను పరిష్కరించుకుంటారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నూతన కార్యక్రమాలను నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది. చిన్న నాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మికంగా నిలిచిపోయిన గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారంచివరి పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహరాశి :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి బంధుమిత్రులతో ఆకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి ఆరోగ్య విషయాలలో మరింత శ్రద్ధ వహించాలి. దూరప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిదానంగా ఉంటుంది. వ్యాపారపరంగా కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున కొన్ని విషయాలలోఅశ్రద్ధ చేయడంవలన ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.అన్ని రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. వారాంతమున నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారం : శివారాధన చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యపరుస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని తప్పులు సరి చేసుకుంటారు శత్రువులు కూడా మిత్రులు వలె మారి సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పెద్దల సహాయంతో కొన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. దూరప్రాంత మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలకు నూతనపెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పారిశ్రామిక వర్గాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం : నవగ్రహారాధన శుభ ఫలితాలు కలిగిస్తుంది.

తుల రాశి:

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యల నుండి ఓర్పుతో బయటపడతారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. గృహం కొనుగోలు ప్రయత్నాలు అనుకూలస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వ్యాపార పరంగా ఊహించని లాభాలను అందుకుంటారు ఉద్యోగ విషయంలో వివాదాలు తొలగి అనుకూలత పెరుగుతుంది కొన్ని రంగాల వారికి విలువైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : దుర్గా ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :

ముఖ్యమైనవ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ధనపరంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో విభేదాలు సర్దుబాటు అవుతాయి. నూతన ఆలోచనలు అమలు చేస్తారు.పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలుతొలగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యన మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి.

పరిహారం : వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధను రాశి :

సమాజంలో కొని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. కావలసిన వారి నుండి శుభవార్తలుఅందుతాయి. విలువైనగృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. పాత మిత్రులతో ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిర్వహిస్తారు కుటుంబసభ్యులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలోబాగస్తులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వారం చివరనకుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్వల్ప ఆరోగ్య ఇబ్బందులుంటాయి

పరిహారం : విష్ణు ఆరాధన శుభ ఫలితాలు కలిగిస్తుంది.

మకర రాశి :

ఇంట బయట సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు అవుతుంది. బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల కష్టానికి ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహం కొనుగోలుకు అవాంతరాలు తొలగుతాయి కొన్ని వ్యవహారాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో విలువైన సమాచారం అందుతుంది. వారం చివరన ధనవ్యయ సూచనలున్నవి. ఆరోగ్య ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభరాశి :

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరిగి రుణ బాధలు తొలగుతాయి. సన్నిహితులతో విలువైన విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వస్త్రాఆభరణాలు కొనుగోలుచేస్తారు. మిత్రులను కలుసుకుంటారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో చిక్కులుతొలగి ఆర్ధిక పురోగతి కలుగుతుంది. విద్యార్థుల విదేశీప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వారం చివరన సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి పనులలో ఆటంకాలు కలుగుతాయి.

పరిహారం : లక్ష్మిదేవి ఆరాధనా చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి :

కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుంటారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిష్కారం దిశగా సాగుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. నిరుద్యోగప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి విముక్తి కలుగుతుంది.కుటుంబ పెద్దల ఆదరణ లభిస్తుంది. వారం ప్రారంభమున ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి గృహమున చికాకులు పెరుగుతాయి.

పరిహారం : రాజరాజేశ్వరి దేవి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.


Next Story