దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి
చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 6:15 AM ISTమేషం:
చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం:
సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు.
మిధునం:
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యా విషయాల అనుకూలిస్తాయి.
కర్కాటకం:
చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం:
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘ కాళిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది.
కన్య:
నూతన మిత్రుల పరిచయాలు లాభం సాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.
తుల:
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం:
వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
ధనస్సు:
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకరం:
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మికధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
కుంభం:
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.
మీనం:
చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.