Telangana: రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

రేషన్‌ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున ఇవ్వాలని యోచిస్తోంది.

By అంజి  Published on  3 Jan 2025 6:39 AM IST
Telangana, ration card holders, Ration rice

Telangana: రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

హైదరాబాద్‌: రేషన్‌ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున ఇవ్వాలని యోచిస్తోంది. శనివారం జరిగే క్యాబినెట్‌ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం దారిద్ర్యరేఖకు దిగువనున్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. సన్న బియ్యానికి మార్కెట్‌లో అధికర ధర ఉండటంతో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సన్న వడ్లను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ సన్నబియ్యం పంపిణీ చేసే ఉద్దేశంలో భాగంగానే ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలసింది.

కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2 నెలల తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. కార్డుల్లోని లబ్ధిదారుల సంఖ్య 281.71 లక్షలుగా ఉంది. వీరందరికీ సన్న బియ్యం పంపిణీకి 1.70 కోట్ల టన్నుల బియ్యం అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. మరోవైపు కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

Next Story