వారఫలాలు : ది. 07-02-21 ఆదివారం నుంచి ది. 13-02-21 శనివారం వరకు
February Second Week Astrology. ఈ వారం ది. 07-02-21 ఆదివారం నుంచి ది. 13-02-21 శనివారం వరకు రాశి ఫలాలు.
By Medi Samrat Published on 7 Feb 2021 9:38 AM IST*ఈ వారం లో గల పర్వ దినములు*
1) 7-2-2021 ఆదివారం *దశమి,ఏకాదశి,ద్వాదశి* కలిసిన *తిథిత్రయ* మహా పర్వదినం. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంచిదే. దానధర్మాలకు, సముద్ర లేదా నదీ స్నానం ప్రశస్తం.
ఈ రోజును *షట్తిల ఏకాదశి* అని అంటారు. నువ్వుల నూనె దీపము నువ్వుల నూనె ఒంటికి రాసుకోవడం, నువ్వులనూనెతో వంట చేయడం, నువ్వులతో పితృ తర్పణం చేయడం, నువ్వులు దానం చేయడం, నువ్వుల వంటకం నివేదనగా పెట్టడం ఆరు రకాలుగా నువ్వులను దైవకార్యంలో వాడడము. ఈ రోజు ఈ పని చాలా ప్రశస్తం. చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
2) 8-2-2021 తేదీ సోమవారం ద్వాదశి మహా పర్వదినం.
3) 10-2-2021 బుధవారం మాస శివరాత్రి.
4) 11-2-2021 పుష్య బహుళ అమావాస్య *చొల్లంగి అమావాస్య* అంటారు సముద్రస్నానం విశిష్టమైనది.
5) 12-2-2021 కుంభం లోకి రవి ప్రవేశము *కుంభ సంక్రాంతి* అంటారు. సంక్రమణం నాడు శివార్చన, రవి అర్చన విశేష ఫలితాన్ని ఇస్తాయి.
6) 13-2-2021 విజయ నాటి చంద్రదర్శనము సాయంత్రం చేస్తే చాలా మంచిది.
మేష రాశి:
ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులన్నీ నెరవేరతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చలు జరుపుతారు. చంద్ర గ్రహ స్థితి కారణంగా వారం మధ్యలో కాస్త ఇబ్బందిగా అనిపించి నప్పటికీ, తర్వాత చాలా ఆనందకరంగా సాగిపోతుంది. ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ మీరు మీరు చేసే ప్రతి పనిలోనూ కాస్త జాగ్రత్త ఇంకా వ్యవహరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వారం మీకు కాస్త ఖర్చులు పెరిగినప్పటికీ ఆనందం సంతోషం వల్ల అది మీకు ఇబ్బందిగా అనిపించదు. ఈ వారంలో మీరు 45 శాతం ఫలితాలు పొందగలుగుతారు. అశ్విని నక్షత్ర జాతకులకు జన్మ తారతో వార ప్రారంభం కాబట్టీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. భరణీ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది మధ్యే మార్గంగా నడుస్తుంది. కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి మాత్రం మిత్ర తారైంది కాబట్టి మంచి ఫలితాలనిపొందగలుగుతారు.
పరిహారం :- శని ప్రభావం వుంది కాబట్టి శనికి జపం చేయించండి. నల్లని నువ్వులు నల్లని వస్త్రము పుచ్చుకునే వ్యక్తి శరీరంపై వినియొగించుకునే విధంగా దానం చేయండి.
వృషభ రాశి :-
ఈ రాశి వారికి ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో చంద్రుడిని మళ్లీ కాస్త ఇబ్బందులకు గురిచేసిన వారాంతంలో సౌఖ్యం ఇస్తాడు. ముఖ్యమైన కొన్ని వస్తువులు లేదా ముఖ్యమైన కాగితాల లాంటివి పోగొట్టుకుంటారు. అయితే ఈ వారంలో దొరకదు.ఆత్మ న్యూనతా భావం చేత మృత్యుభయం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుది. రాజ దండన ఉందని భయపడవలసిన అవసరమైతే లేదు కానీ ప్రతిరోజూ శివ సందర్శనం చేయండి. నీ కష్టాన్ని కలిగించనుండగా బుధుడు మీకు ద్రవ్య నష్టం ఇస్తున్నాడు. శుక్ర, గురు గ్రహ స్థితి కారణంగా మీకు ధనధాన్యాలతో ఈ వారంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. ఈ వారంలో మీకు 36 శాతం మాత్రమే శుభఫలితాలుంటాయి. కృతిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి మిత్ర తార అయ్యింది చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు. రోహిణి వ నక్షత్ర జాతకులకు నైధన తారైంది ఫలితాలు చాలా వ్యతిరిక్తంగా ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి సాధన తార అయ్యింది కాబట్టి అనుకున్న పనులు నెరవేరుతాయి.
పరిహారం : వీరికి కుజుడు కష్టాన్ని కలిగిస్తాడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యుని పూజ చేయండి లేదా ఆంజనేయ స్వామిని దర్శించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.
మిధున రాశి :-
ఈ వారం మీరు ప్రశాంతమైన, సుఖవంతం జీవితాన్ని గడుపుతారు.భూ సంబంధమైన వ్యవహారాల్లో శుక్రుడు ప్రభావం చేత మీరు గెలుచుకోగలుగుతారు. శని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరించడం చాలా అవసరం. కుజ గ్రహస్థితి మీకు కావలసినంత ధనాన్ని సమకూరుస్తుంది ఇక బుధుడు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. అలాగే కేతువు కూడా మీకు హాయిగా జీవితాన్ని కొనసాగించడానికి అనుకూలతను ఇస్తున్నాడు. ఈ వారంలో మీరు 54 శాతం శుభపరిణామాలు పొందగలుగుతారు. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి పరమ మిత్ర తారైంది. చాలా చక్కనైనా ఫలితాలు పొందగలుగుతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది ఫలితాలు చాలా క్లిష్టంగా ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది మంచి కుటుంబ వ్యవస్థని పొందగలుగుతారు.
పరిహారం :- శనికి నల్లని నువ్వులు, నువ్వుల నూనె దానం చేయండి. శనీశ్వరుడి దర్శనం చేసుకోండి. శనివారం నియమాన్ని పాటించండి ఫలితాలు బాగుంటాయి. అలాగే రాహువుకు జపం చేయించడం కూడా మంచిదే.
కర్కాటక రాశి :-
ఏ రాశి వారికి ఈ వారం ధనలాభం తో పాటు ఆనందంగా కూడా గడుపుతారు. అయితే శుక్ర గ్రహ స్థితి వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు అన్ని నెరవేరుతాయి ఆర్థికంగా కూడా వుంటుంది అయితే శని మాత్రం మిమ్మల్ని కనపడని విచారం లోకి నెట్టివేస్తూ ఉంటాడు ఈ విషయంలో కాస్త ఆలోచించి అవసరం లేని విషాదం గురించి ఆలోచించకుండా ఉంటే ఈ వారం మీకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ వారంలో మీకు 54% శుభ పరిణామాలు ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసర విషయాలను ముందడుగు వేయండి. పునర్వసు నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది చాలా ప్రయోజనకరంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రయోజనాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష లాభాన్ని పొందగలుగుతారు.
పరిహారం : శుక్ర గ్రహానికి ప్రీతిగా శుక్రవారం నియమాన్ని పాటించడం అమ్మవారి పూజ నిత్యం ఖడ్గమాలా పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శని జపం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సింహ రాశి :-
మీరు ఈ వారంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో కలయిక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభసాటిగా ఉంటాయి. వారాంతం సోదరులతో అనుకోని విభేదాలుతలెత్తుతాయి. ప్రయాణాలలో ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారంలో మీకు 45% శుభ ఫలితాలు ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పుబ్బ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది కాబట్టి పర్వాలేదు బాగుంది. ఉత్తర ఒకటో పాదం వారికి మిత్ర తారైంది చాలా అనుకూలమైన వారంగా చెప్పొచ్చు.
పరిహారం : సర్ప సూక్త పారాయణ పనికివస్తుంది. అవకాశాన్ని బట్టి గురువారం నియమాన్ని గాని శుక్రవారం నియమాన్ని గాని పాటించండి.
కన్యా రాశి :-
ఈ రాశివారికి వారం ప్రారంభం కొంచెం సాదా సీదాగా వున్నప్పటికీ మధ్యలో చక్కని ధనలాభాదుల్ని పొందగలుగుతారు. సంతాన విషయంలో మాత్రం వీరు ప్రతీక్షణము జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్థికవృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వారం చివరన ధనవ్యయం సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో కుటుంబ సభ్యులతో మీ మాటతో విభేదిస్తారు. ఈ వారంలో మీకు 45% శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయ్యింది చాలా బాగుంది. హస్త వారికి నైధన తారైంది కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించండి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ చక్కబడతాయి
పరిహారం :- రవిచంద్ర స్థితి బాగాలేదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. ఏకాగ్రత కోసం యోగా సాధన చేయండి. గురు స్తోత్ర పారాయణ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచివి .
తులా రాశి :-
ఈ రాశి వారు ఈ వారంలో అవసరానికి ధనసహాయం లభించక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారాలలో లోటుపాట్లుఉంటాయి. నిరుద్యోగులకు అత్యధిక శ్రమతో స్వల్ప ఫలితాలుంటాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆర్థిక విషయాల గురించి సన్నిహితులతో సంప్రదింపులు చేస్తారు. ఋణ బారం అధికమౌతుంది. చిన్న చిన్న విషయాలకు తొందరపాటు మంచిది కాదు.చిరు వ్యాపారులకు సామాన్యంగా లాభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. సోదరులతోవాదన మంచిది కాదు. వారాంతమున ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి.ఈ వారంలో మీకు 36% శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్త మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ సమకూరుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రత్యేక్ తారైంది కాబట్టి పనులు నెరవేరడం కష్టం. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు బాగున్నాయి.
పరిహారం : రాహు కేతు శని గ్రహాలకు జపాలు దానాలు చేయించండి శుభ ఫలితాలని పొందగలుగుతారు.
వృశ్చిక రాశి :-
ఈ వారంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో నూతన ఒప్పందాలు ఉంటాయి కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుని. సఖ్యతగా వ్యవహరిస్తారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి సంతాన విద్యా విషయాలలో వచ్చిన ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలుకలుగుతాయి. వారాంతమున కుటుంబసభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఈ వారంలో మీకు 45% శుభఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి క్షెమ తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు విపత్తార కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు సంపత్తు తార అయింది కాబట్టి వీరికి ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది.
పరిహారం :- బుధ గురులు జప తర్పణలు చేయించండి నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఆవుకి తినిపించండి శనగలు దానం చేయండి.
ధనూ రాశి :-
ఈ రాశివారికి చక్కని భోజన సౌకర్యం ధనలాభం సకల భోగాలు అందబోతున్నాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతనుచాటుకుంటారు. కొన్నివిషయాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధువర్గంతో సఖ్యత గా వ్యవహరిస్తారు సంఘంలో పేరుప్రతిష్టలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాల కలిగిస్తాయి. ఉద్యోగపరంగా అధికారుల నుండి ఉన్న సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఈ వారంలో మీకు 54% శుభఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి అనారోగ్య సూచనలున్నాయి. పూర్వాషాఢ వారికి పరమమిత్రతార అయ్యింది అనుకూల పరిస్థితులున్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్ర తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి.
పరిహారం: శనికి జపం చేయించడం నల్లనువ్వులు నువ్వుల నూనె దానం చేయడం శనివారం నియమాన్ని పాటించడం శనివారంనాడు తల రుద్దుకొని శని సందర్శనతోపాటు శివ సందర్శన చేసుకోవడం చాలా మంచిది .
మకర రాశి :-
ఈ వారంలో మీరు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనులలో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికవిషయాలు మెరుగైనవాతావరణం ఉంటుంది రియల్ఎస్టేట్ వ్యాపారులకు లాబాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు. వారం ప్రారంభంలో ధన పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రతికూలత పెరుగుతుంది. ఈ వారంలో మీకు 36% శుభఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు. శ్రవణానక్షత్ర జాతకులు నైధన తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది పరిస్థితులనుబట్టి పనులన్నీ నెరవేరతాయి.
పరిహారం :- నువ్వులు దానం చేయండి శనివారం నాడు ఉపవాసం ఉంటే మీకు ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఆ రోజు ఒక పేద బ్రాహ్మణులకు ఏదైనా దానం చేయండి శనిని స్మరించండి శని శ్లోకం చదవండి.
కుంభ రాశి :-
ఈ వారంలో మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. చుట్టుపక్కల వారితో సఖ్యత గా వ్యవహరిస్తారు విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో మంచి ఫలితం పొందుతారు. ఉద్యోగము స్థాన చలన సూచనలు అనుకూలంగా మారతాయి. కుటుంబమున ఒక విషయం ఆసక్తి కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారంలో మీకు 36%మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి సాధన తారైంది పనులన్నీ నెరవేరతాయి. శతభిషం వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి కుటుంబపరంగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు.
పరిహారం : రాహు కేతు శని గ్రహాలకు జపాలు దానాలు చేయించండి శుభ ఫలితాలని పొందగలుగుతారు.
మీన రాశి :- ఈరాశి వారికి సంపదలు సౌఖ్యాలు లాభాలు అన్నీ ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. గొప్ప ఆనందాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని పొందుతారు. కేతువు మీకు ప్రతికూలతను సూచిస్తున్నాడు కాబట్టి దాని ప్రభావంతోనే మీకు శత్రువులు పెరుగుతారు. అలాగే వ్యయ మందున్న కుజుడు కష్టాన్ని కలుగజేస్తున్నాడు. చంద్రుడు మీకీసారి ఎక్కువగా శుభాల్ని కలుగజేస్తున్నాడు. ప్రతి ఒక్క గ్రహము మీకు ఈ వారంలో చాలా అనుకూలంగా పనిచేస్తూనే ఉన్నాయి కాబట్టి అనంతమైన శుభఫలితాన్ని మీరు పరంపరగా ఒకదాని వెంట ఒకటి ఈ వారంలో పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. బుధ ప్రభావం చేత ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే వాటిని గూర్చి మీరు పెద్దగా పట్టించుకోరు. దానికి తగిన ఆదాయం ఉంది కాబట్టి.ఈ వారంలో కూడా మీరు అత్యధికంగా 81%శుభఫలితాలు పొందుతారు. పూర్వాభాద్ర నాల్గో పాదం వారికి క్షేమ తారైంది పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉత్తరాభాద్ర వారికి మాత్రమే విపత్తు తార అయ్యింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సంపత్తు తార అయింది కాబట్టి మంచి ఫలితాలు మంచి ఆర్థిక వనరులు సమకూరుతాయి.
పరిహారం :- కుజుడికి మంగళవారం నియమం పాటించండి.