వార ఫలాలు : ది. 28-02-2021 నుండి ది. 06-03-2021 వరకు

February Last Week Astrology. ఈ వారం రాశి ఫలాలు ది. 28-02-2021 నుండి ది. 06-03-2021.

By Medi Samrat  Published on  28 Feb 2021 4:07 AM GMT
February Last Week Astrology

వారంలో ముఖ్యమైన‌ రోజులు

28-02-21 మాఘా ఆదివారం. సూర్య నారాయణుడిని స్మరించండి.

02-03-21 సంకష్ట హర చతుర్థి, సుభ్రమణ్య స్వామి పూజ.

05-03-21 త్రిస్రో ష్టకము, సముద్ర స్నానం మంచిది.

మేషరాశి :

చేపట్టిన పనులలో నిదానంగా పూర్తిచేస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం బాగున్నా తగిన ఖర్చులు ఉంటాయి.కొన్ని వ్యవహారాలలో మిత్రులకు సాయం అందిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో కింది వారిపై ఆధారపడటం మంచిదికాదు. సన్నిహితుల ప్రవర్తన అసహనం కలిగిస్తుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహ నిర్మాణ విషయాలలో శ్రద్ధ వహిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడం అనుకూలంకాదు. నిరుద్యోగ అవకాశములు లభిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని పనులలో నిదానంగా వ్యవరించాలి. ఈ వారంలో మీకు 45% శుభఫలితాలు ఉన్నాయి.

పరిహారం : దేవి ఖడ్గమాలా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

స్థిరాస్తి వివాదాలను సంఘంలో పెద్దల సహాయంతో రాజి చేసుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అవసరానికి ఇతరులనుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న సమయానికి చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు గృహమున శుభకార్య ప్రయత్నాలు సాగిస్తారు. నూతన పరిచయాలు అంతగా లాభం కలిగించవు. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వారం మధ్య ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆప్తుల నుండి వినకూడని మాటలు వినవలసి రావచ్చు. 45% మాత్రమే శుభ పరిణామాలు ఉండటం వల్ల వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి.

పరిహారం : కనకధారా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిధున రాశి:

ముఖ్యమైన వ్యవహారాలు ఊహించిన విధంగానే జరుగుతాయి. మంచి రోజులు భవిషత్తు లో వస్తాయి అన్న ఆలోచనతో వృత్తి ఉద్యోగాలలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. 45శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉండటం వల్ల ఎదుటివారి విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. చేతిలో ధనం నిలవడం కష్టంగా మారుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. గృహ నిర్మాణ పనులు మధ్యలో నిలిపివేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి కొత్త పనులకుశ్రీకారం చుడతారు. వారాంతమును వృత్తి ఉద్యోగాలలో ఏకాగ్రత లోపం వలన అధికారులు ఆగ్రహం కలుగుతుంది నూతన రుణాలు చేయవలసి రావచ్చు వాహన ప్రమాదం సూచనలు ఉన్నవి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :

ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. 54 శాతం శుభ పరిణామాలు ఉన్నందున వ్యాపార వ్యవహారాలలో రాణిస్తారు.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలాస వస్తువులపై ధన వ్యయంచేస్తారు. ఉద్యోగాలలో ధన సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. కొన్ని పనులు ఆకస్మికంగా నిలిపివేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి స్థోమతకు మించి సహాయం చేయడం మానుకోవాలి. సంతానం ఉన్నత చదువులకు అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటారు. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు సాగిసస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లాభసాటిగా సాగుతాయి వారాంతం కొన్ని పనుల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : శ్రీ సూక్తం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి :

సమాజంలో ఆదరణ పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఒక సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ విషయాలలో అనుకూలత పెరుగుతుంది. గృహ మార్పులు కలుగుతాయి ఉద్యోగ విషయమై అధికారులు నుండి అందిన సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. విద్యా రంగం వారికి ఒత్తిడి తొలగుతుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 45%శుభ పరిణామలు కావడం వల్ల వారం ప్రారంభంలో ధన ఇబ్బందులను తప్పవు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

పరిహారం :శ్ రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. రాజకీయ విషయాలలో ఆశించిన పదవులు దక్కవు ఉద్యోగమున మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. 36%మాత్రమే అనుకూలంగా ఉండటం వల్ల అనవసర ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్దికగా సతమతమౌతారు. వారం మద్య నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత బంధు మిత్రుల రాక ఉత్సాహాన్నిస్తుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థుల కృషి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యులమద్య సఖ్యత పెరుగుతుంది అనీ విషయాలలో మొండిగా ప్రవర్తించడం మంచిదికాదు సంతానం విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటారు వారం చివరన కొన్ని రంగలవారికి శ్రమదిక్యత కలుగుతుంది.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి :

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రభుత్వ సంభందిత జరిమానాలు కట్టవలసిరావచ్చు .సమాజంలో ప్రముఖులతో చర్చలు అనుకూలించవు. 36%మాత్రమే శుభఫలితాలు కావడం వల్ల చేపట్టిన పనుల్లో జాప్యం అధికమై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు మానసికంగా స్థిమితంఉండదు. బంధువులతో కొన్ని విషయాల గూర్చి చర్చలు జరుపుతారు. దీర్ఘ కాలీక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి ఉద్యోగాలలో అదికారుల సహాయంతో కొన్ని సమస్యలనుండి బయటపడతారు. నూతన పరిచయాలు ముందు కాలానికి ఉపయోగపడతాయి. వ్యాపారలలో అందివచ్చిన అవకాశములు విడవకుండా చూడటం మంచిది. విద్యార్ధులు మరింత కష్టపడాలి వారాంతమున వృత్తి వ్యాపారములలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ఆర్దికంగా కుదుటపడతారు.

పరిహారం : నరసింహ కరావలంభ స్తోత్రం పారాయణం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చికం రాశి :

ప్రయణాలలో నూతన పరిచయాలు కలసివస్తాయి మంచి మాటతీరు అందరినీ ఆకట్టుకుంటారు.చేపట్టిన వ్యవహారాలుఅనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశాలను పొందుతారు. ఆప్తులకు సహాయం అందిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతన పదవులకు ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శ్రద్ద వహించాలి. వారం మద్యనుండి ఉద్యోగాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 45%శుభ ఫలితాలు కావడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. సోదరులతో ఆస్తి వివాదాలకు సంప్రదింపులు జరుపుతారు. ఆద్యాత్మిక చింతన కలుగుతుంది.

పరిహారం : వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధను రాశి :

మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగ విషయమై ముఖ్యమైన నిర్ణయాలు కలసివస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు పునః ప్రారంభిస్తారు. వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది బాధ్యతలు అధిక అయినప్పటికీ సమర్థవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్త అందుతాయి విద్యారంగం వారికి పనిఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా కష్టపడాలి. అయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగా 72% శుభఫలితాలు ఇస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల కాలం. వారంప్రారంభంలో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధు మిత్రులతో చిన్న మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగులకు మాత్రం నిరాశ తప్పదు.

పరిహారం : శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి :

చేపట్టిన పనులలో తీరిక ఉండదు.స్ధిరాస్తి ఒప్పందాలకు అనుకూలం పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధన విషయాలలో హామీలు ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఖర్చులను అదుపులో ఉంచాలి. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి దూరప్రాంత బంధువులను కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. 36%మాత్రమే శుభ పరిణామాలు ఉంటాయి. కుటుంబసభ్యుల మాటలు వివాదాస్పదంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల పరిచయాలు లాభిస్తాయి నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి దూరప్రాంత ప్రయాణాలు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి.

పరిహారం : కాలభైరవ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం రాశి :

ఆదాయా మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. భూవివాదాలు పెద్దల సహాయంతో రాజీచేసుకుంటారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో చిన్నపాటి అసంతృప్తి కలుగుతుంది. ఉద్యోగమున ఒక సంఘటన నిరాశ కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది. వివాహ శుభకార్య ప్రయత్నాలు కొనసాగిస్తారు వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి.ఈ వారం అతి తక్కువ శుభ పరిణామాలు ఉండటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది.. కాబట్టి శారీరిక మానసిక ధైర్యం అవసరం.వారం చివరన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం మంచిదికాదు.

పరిహారం : సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి :

ఈ వారం 72% శుభ పరిణామలతో అద్భుతం గా ఉంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మరింత అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. ధన పరంగా లోటు ఉండదు. ఇతరులకు ఇవ్వవలసిన రుణాలను తీర్చగలగుతారు. బంధుమిత్రులలో మీ విలువ పెరుగుతుంది నూతన విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించడం మంచిది. నూతన వ్యాపారాలు అభివృద్ధికి చేయూత లభిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారంతమున స్వల్ప అనారోగ్యసమస్యలు బాధిస్తాయి.

పరిహారం : మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
Next Story