వార ఫలాలు : ది.31-01-2021 నుండి ది.06-02-2021 వరకు

February First Week Astrology. ఈ వారం వార ఫలాలు : ది.31-01-2021 నుండి ది.06-02-2021 వరకు

By Medi Samrat  Published on  31 Jan 2021 7:17 AM GMT
free astrology in Telugu

మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. రవి మీకు కార్య జయాన్ని కలిగిస్తున్నాడు. అయితే ఫలితాన్ని పొందడం కోసం మీరు విపరీతమైన శ్రమ పడవలసి ఉంటుంది. మీకు రాహువు కేతువులు అకారణ కలహాలు చోర బాధ కలిగిస్తుండగా శని మీకు రాజకీయంగా కూడా ఇబ్బందులు కలుగ చేయనున్నాడు. శుక్రుడు మీకు సంతోషం కలిగించనున్నాడు. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా మారతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు నుండి బయటపడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహ వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా లాభసాటిగా సాగుతాయి. వృత్తి,ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది వారాంతమున చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. మిత్రులతో తగాదాలకు వెళ్లకపోవడం మంచిది. అశ్వినీ నక్షత్ర జాతకులకు సంపత్తా రైంది ఆర్థిక లాభాలున్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు జన్మ తారైంది అనారోగ్య శిరోవేదన లేదా కంటికి అనారోగ్య సూచన ఉన్నది. కృత్తిక ఒకటో పాదం వారికి పరమ మిత్రతారైంది మధ్యమ ఫలితాలు చేకూరుతాయి.

పరిహారం : గురు చరిత్ర పారాయణం,దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. సర్ప సూక్త పారాయణ కూడా మంచిదే.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈవారం పెద్దగా అనుకూలంగా ఉండదు. అయితే ఆర్థికమైన విషయాలలో కాస్త పర్వాలేదు. రవి, కుజులు,రాహుకేతువులు మీకు వ్యతిరేకంగా పని చేసే పనిలో ఉన్నారు కాబట్టి చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధన పరమైన అనుకూలత కలుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. పాతమిత్రులతో చర్చలో పాల్గొంటారు. గృహమున వివాహాది శుభకార్యములకు ప్రస్తావన వస్తుంది. కొన్ని వ్యవహారాలు ఆశ్చర్యపరుస్తాయి. సంతానం విద్యా విషయాలలోసంతృప్తికర ఫలితాలు ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి పరమమిత్రతార యింది. మధ్యమ ఫలితాలున్నాయి. రోహిణీ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ ఫలితాలు చాలా ఎక్కుఅ ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి నైధన తారైంది వ్యతి రిక్త ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- సూర్యనమస్కారాలు, సూర్యోదయ సమయానికి సూర్య దర్శనం చేయండి. కుజునికి జపం చేయించండి మంచి ఫలితాన్నిస్తుంది.

మిథున రాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ తండ్రిగారి ఆరోగ్య విషయంలో నైనా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.గురుడు మీకు అనుకోని శ్రమను కలిగిస్తాడు.. అయితే శుక్ర గ్రహ స్థితి వలన సంతోషం అనుభవిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా కాలంగా కుటుంబ సమస్యలు నుండి ఊరట కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల నుండి ప్రశంసలుపొందుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునిముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యన స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి నైధన తార అయ్యింది వ్యతిరిక్త ఫలితాలే ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతులకు సాధన తార అయ్యింది సత్ఫలితాలు ఎక్కువగా పొందనున్నారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి అనుకూలంగా లేదు.

పరిహారం :- నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది.

కర్కాటకరాశి :- ఈ రాశివారికి సప్తమ స్థానం అయినటువంటి శని ప్రభావం బాగా లేకపోవడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది. ఇంటిలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. మీకు శుక్ర గ్రహ స్థితి కారణంగా అనారోగ్యం కనిపించే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున పై వారి నుండి ఒత్తిడి పెరుగుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు ఆర్థికంగా చేపట్టిన పనులు కలిసిరావు. కుటుంబ సంబంధిత బాధ్యతలు అధికమవుతాయి దూర ప్రాంత ప్రయాణాలు వలన శారీరక శ్రమ కలుగుతుంది వారాంతమున అనారోగ్యసమస్యలు కలుగుతాయి. పునర్వసు నాలుగో పాదం వారికి ప్రత్యక్ తారైంది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది మంచి లాభాలు పొందగలుగుతారు. ఆశ్రేష నక్షత్ర జాతకులకు విపత్తార అయింది ప్రతి పనిలోనూ ఆటంకాలు చవిచూస్తారు.

పరిహారం :- శనికి జపము, నల్ల నువ్వుల దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. గోవును నిత్యము చూసి నమస్కారం చేయండి.

సింహ రాశి :- ఈ రాశివారికి ఈ వారంలో మీ శత్రువుల లో సైతం మీరు మంచి పేరు సంపాదించుకుంటారు. రాహుకేతువుల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. దానివల్ల కూడా గౌరవ భంగం జరిగే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి.రుణాలు తీర్చగలుగుతారు. బంధువులతో మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం చేసుకుంటారు. విద్యాపరంగా అనుకూలత పెరుగుతుంది. ఊహించని సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఉద్యోగాలలో చేపట్టిన పనులవలన అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వారాంతమున ధన వ్యయ సూచనలు ఉన్నవి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మఖ నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష శుభ ఫలితాలు ఉన్నాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది ఆరోగ్యం జాగ్రత్త చేసుకోండి. ఉత్తర ఒకటో పాదం వారికి పరమ మిత్రతార అయింది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం :- రాహు కేతువులకు పూజలు చేయించండి కాలసర్ప దోషం పూజ చేయిస్తే మంచిది.దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి :- ఈ రాశివారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రాజీ చేసుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్యా ఆహ్వానాలు అందుతాయి గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలులాభిస్తాయి. వ్యాపారప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. సంతానం పోటీపరీక్షలలో మంచి ఉతీర్ణత సాధిస్తారు వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలలో వాహన ప్రమాదం సూచనలు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి పరమమిత్రతార అయింది శుభ ఫలితాలు ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది ఆర్థిక వనరులు సమకూరుతాయి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి నైధన తార అయ్యింది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : సుదర్శనాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి :- సహజంగా వీరు సమతుల్య స్థితిని పొందగలుగుతారు కానీ శని రాహు కేతువు ల యొక్క ప్రభావము వీరిని అనారోగ్యం పాలు చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల నుంచి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారపరంగా అనుకూలత పెరిగి లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు కలసి వస్తాయి. వారాంతం చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది సత్ఫలితాలు ఎక్కువగా చవిచూస్తారు. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యక్తార అయ్యింది కాబట్టి వ్యతిరక ఫలితాలే ఉన్నాయి.

పరిహారం: శనికి జపము హోమము నల్ల నువ్వులు దానం చేయండి తైల అభిషేకం చేయించండి. శని స్తోత్రం పఠించండి. రుద్రాభిషేకము విశేష ఫలితము.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో గురు గ్రహము కూడా మీకు అనుకూలంగా లేక పోవటం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ఈ వారం మీకు ఆర్థికంగా కూడా బాగా వుంటుంది.కుజ ప్రభావం చేత శత్రువులు కూడా మీకు ఎక్కడపడితే అక్కడ ఉంటారు వారి నుండి దూరంగా ఉండాలి ప్రయత్నించండి. బంధు, మిత్రులతో చర్చలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి ఆర్ధిక వ్యవహారాలు మరింతగా పుంజుకుంటాయి.సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో సరైన ఆలోచన చేసి అనుకూల ఫలితాన్ని పొందుతారు. గృహ నిర్మాణానికి ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగపరంగా సహోద్యోగులతో ఉన్న మాటపట్టింపులు తొలగుతాయి. వారాంతమున కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విశాఖ నాల్గవ పాదం వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం క్షేమ తారయింది చాలా మం మంచి ఫలితాలు పొందనున్నారు. జ్యేష్టా నక్షత్ర జాతకులకు విపత్తార యైనది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

పరిహారం :- ఏకాగ్రత కోసం ప్రయత్నించండి. ధ్యానం మీకు ఉపకరిస్తుంది. గణపతి అర్చన శుభప్రదం.

ధనూ రాశి :- ఈ రాశివారికి గురుడి ప్రభావం చేతవ్యాపారంలో గానీ విద్యా వ్యాసంగం విషయంలో గానీ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే, అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే మంచి ఫలితాలు పొందుతారు.దైవ సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో పురోగతి కలుగుతుంది. సంతాన పరంగా నూతన విద్యా అవకాశములు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రుణాల వసూలు చేసుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కారం చేసుకుని లబ్ధి పొందుతారు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాహన క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. మూలా నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది అనారోగ్య సూచన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మాత్రమే పరమమిత్రతార అయింది కొంత ఆనందాన్ని తృప్తిని ఇస్తాయి.

పరిహారం :- శని దోషం పోవడానికి జపం చేయించండి హోమాదులు జరిపించండి దానధర్మాలు చేయండి.

మకర రాశి :- ఈ రాశివారికి బంధుమిత్రులతో ఉన్న భూ సంబంధిత తగాదాలు పరిష్కారమవుతాయి. గృహమున శుభకార్య ప్రయత్నాలు ముమ్మరంచేస్తారు. ఆత్మీయులు నుండి కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేస్తారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి అనుకూల వాతావరణం కలుగుతుంది. కొన్ని రంగాల వారు ఉత్సాహంగా పనిచేసి మంచిఫలితాన్ని పొందుతారు. వారాంతమున ప్రయాణ సూచనలు ఉన్నవి. పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది. శ్రవణానక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది. పరిస్థితులు అనుకూలత ఉన్నది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి మిత్రతార అయింది చాలా సత్ఫలితాలు పొందగలుగుతారు.

పరిహారం: శని గురు జపం చేయించండి గ్రహమఖం (యజ్ఞం ) చేస్తే చాలా మంచిది. గురు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠనం మరువకండి

కుంభ రాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో ఇంటాబయట అనుకూలవాతావరణం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు పాత మిత్రులతో కొన్ని విషయాల గురించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిరు వ్యాపారులుకు అనుకూలత కలుగును. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వారం మధ్యన కుటుంబ సంబంధిత ఒత్తిడులు పెరుగుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది.ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి నైధన తార అయింది పూర్తి వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది పరిస్థితులు బాగా లేవు.

పరిహారం :- శని జపం చేయించండి. నవగ్రహ దర్శనం. నిత్యము రుద్రాభిషేకము చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. గో సందర్శనము శివ సందర్శనము ప్రతిరోజు మీ జాతకానికి చాలా అవసరం.

మీన రాశి :- ఈ రాశి వారికి బంధు మిత్రుల సహాయ సహకారాలతో దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.కొన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.ఆదాయమార్గాలు పెరుగుతాయి. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. .బంధు,మిత్రులతో తీర్థయాత్రలో పాల్గొంటారు చేపట్టిన పనులు సంఘంలో మరింత విలువను పెంచుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభమునకు చేపట్టిన ప్రణాళికలుఅనుకూలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్నిరంగాలవారికిఅనుకూలత పెరుగును వారాంతంలో రుణ వత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులు తో మాట పట్టింపులు ఉంటాయి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి ప్రత్యక్ తార అయ్యింది ప్రతికూలంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది ఆర్థికంగానూ చాలా బాగుంది. రేవతి నక్షత్ర జాతకులకు విపత్తార అయ్యింది ప్రతికూల పరి స్థితులు ఉన్నాయి.

పరిహారం :- కుజునికి జపం చేయించండి. సుబ్రహ్మణ్యం పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.


Next Story