వారఫలాలు : తేదీ 27 -12 -2020 నుండీ 2-01-2021 వరకు

December last Week Raashi Palalu. ఈ రాశి వారికి ఈ వారం అంతా చెప్పుకోదగ్గ ఫలితాలు ఇవ్వదు. ధననష్టం, విచారం, కష్టాలు

By Medi Samrat  Published on  27 Dec 2020 9:47 AM GMT
వారఫలాలు : తేదీ 27 -12 -2020 నుండీ 2-01-2021 వరకు

తేదీ 27-12-2020 ది ఆదివారం *హనుమద్వ్రతం*

తేదీ 29-12-2020 మంగళవారం *దత్త జయంతి*

తేదీ 30-12-2020 ది ఆదివారం *ఆర్ద్ర ఉత్సవము* * శివముక్కోటి* జాగరణకు సాధకులకు ప్రశస్తమైనది.

తేదీ 31-12-2020 ది గురువారం *పరశురామ జయంతి*.

తేదీ 2-1-2021 ది శనివారం *సంకష్టహర చతుర్థి* గణపతికి ప్రీతిపాత్రమైనది.

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం అంతా చెప్పుకోదగ్గ ఫలితాలు ఇవ్వదు. ధననష్టం, విచారం, కష్టాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవటం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు ఎవరితో నీ గొడవ పడాలి అని అనుకోకపోయినా ఏదో ఒక కారణంతో వివాదములు చుట్టుముడతాయి. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఈ వారం మీకు భూ సంబంధమైన విషయాలు కలసి వస్తాయి. భూముల అమ్మకం కొనుగోలు అంశం మాత్రమే కాదు, వ్యవసాయ సంబంధంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈవారం మీకు 18 శాతం మాత్రమే శుభ ఫలితాలున్నాయి. పూర్తి అననుకూల పరిస్థితుల్లో సైతం భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు అన్న విషయాన్ని గుర్తించండి.అశ్వినీ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది సానుకూలత ఎక్కువగా ఉంది. కృత్తిక ఒకటో పాదం వారికి విపత్తార ఐనది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువ గా ఉన్నాయి.

పరిహారం: నవగ్రహ హోమం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈ వారం అంతంతమాత్రంగానే ఉంటుంది. అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పెరుగుతున్న శత్రువులు మీకు మానసిక ప్రశాంతత కూడా దూరం చేస్తారు. అయినా సరే ధైర్యంగా ఉండండి. భయ పడటం కంటే భగవంతుని ప్రార్థించడం ద్వారానే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు అన్న విషయాన్ని నమ్మండి. అవరోధాలు ఎదురైనప్పటికీ మీరు కోరుకున్న పనులు మాత్రం నెరవేరుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే మీకు డబ్బులు అవసరం వచ్చిన ప్రతీసారి ఎవరిని అడగాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది. ఈవారం మీకు 36 శాతం శుభ ఫలితాలు కలుగుతాయి.

పరిహారం: శనికి కుజుడికి జపాలు చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి:

ఈవారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసిన తప్పులు మిమ్మల్ని దోషిగా నిలబడుతున్నాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈవారం మీరు డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అయితే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. చేసిన పొరపాట్లు మీకు అపకీర్తిని తెచ్చి పెడతాయి. కనీసం ఇటువంటి పొరపాట్లు మరొకసారి చేయకుండా ఉండటం ద్వారా జీవితంలో మంచి రోజులను పొందగలుగుతారు. మానసికంగా మీరు ఎంత మదన పడినప్పటికీ శారీరకమైన కష్టాలు మాత్రం మీరు అనుభవించరు. ఇవాళ మీకు 36% శుభపరిణామాలు ఉన్నాయి.కృత్తికా రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తారయింది కాబట్టి ప్రతి కూలతలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ వారికి సంపత్తార అయి ధనలాభాదులు ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి జన్మ తార అయింది అనారోగ్య సూచన ఉన్నది.మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి జన్మ తారైంది అనారోగ్య సూచన చూసుకోండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయ్యింది కాబట్టి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి మిత్రతార అయింది కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయి.

పరిహారం: గురువార నియమాలు పాటించండి సాయిబాబా, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు. చేసిన ప్రతి పని మీకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇంటికి వచ్చిన చుట్టాలు వల్ల కూడా మీకు లాభం ఉంటుంది తప్ప ఈ రకమైన కష్టం కూడా ఉండదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారంలో మీకు శత్రువులు ఎటువంటి నష్టాన్ని కలిగించలేక పోతారు. ఏదో చిన్న చిన్న అవసరాలకు తప్ప పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన రోజు కూడా ఈ వారంలో మీకు రాదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇవాళ మీకు 63% శుభపరిణామం ఉన్నాయి.పునర్వసు నాలుగో పాదం వారికి సానుకూలత ఎక్కువగా ఉంది ఫలితాలు బాగుంటాయి. పుష్యమి వారికి నైధన తార అయ్యింది కాబట్టి ప్రతి కూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి సానుకూలత ఎక్కువగా ఉంది.

పరిహారం: రవికి సూర్యనమస్కారాలు శని గ్రహానికి జపం చేయించటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

సింహరాశి:

ఈ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మీరు చేపట్టిన విషయాలలో స్త్రీ ద్వారా లాభాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా కాస్త అటూ ఇటుగా ఉన్నప్పటికీ అవసరానికి తగిన డబ్బు చేతికి అందడం తో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. కానీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది లేదో తెలియక మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. కొన్ని అనవసరమైన విషయాలలో కల్పించుకోవడం ద్వారా మీ గౌరవానికి భంగం కలుగుతుంది ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే నీ ప్రశాంతత కు ఎటువంటి భంగము కలదు ఈ వారంలో మీకు 36శాతం శుభ పరిణామాలు ఉన్నాయి.మఖ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి విపత్తార అయ్యింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం: గురువులను గౌరవించటం, గురుపాదుకా స్తోత్రం పారాయణ వంటివాటి ద్వారా మంచి ఫలితాలను పొందగలరు

కన్య రాశి:

రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మీ ఆరోగ్యమే కాదు మీ పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం. మీరు చేసే కొన్ని పనులు నచ్చక పోవడం వల్ల శత్రువులు పెరుగుతారు, మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇటువంటి విషయాలను మీరు పెద్దగా మనసులో పెట్టుకోకండి ఎందుకంటే మీకు శత్రుజయం తప్పదు. ఈ వారంలో మీకు సర్వసంపదలు కలిసివస్తాయి. ఈ వారం మొత్తం మీద మీకు 54 శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తు తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది ఆర్థికపరంగా ఆనందాన్ని ఇస్తుంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది జాగ్రత్త వహించండి.

పరిహారం: రవికి సూర్య నమస్కారాలు, శనికి జపం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

తుల రాశి :

ఏ రాశి వారికి ఈ వారం అంతంతమాత్రంగానే ఉంటుంది. చేసే ఏ పని పూర్తయినట్టు కనిపించదు. అడుగడుగున శత్రువుల వల్ల మీకు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వీటితో పాటు అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏదో ఒక విలువైన వస్తువు కోల్పోయే అవకాశం ఉంది కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. అయితే ఆర్థికంగా మీకు కాస్త బాగానే ఉంటుంది. ఆభరణాలను పొందే అవకాశం ఉంది. ఈవారం మీకు 27% శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్త మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది అనారోగ్య సూచన. స్వాతీ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయ్యింది మంచి ఫలితాలు ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్రతార అయింది సానుకూలత ఎక్కువగా ఉంది మంచి ఫలితాలు పొందుతారు.

పరిహారం :- నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారం నాడు ఆవుకు తినిపించండి మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుడికి జపం చేయించండి దత్తాత్రేయ స్తోత్రం కూడా మీకు మంచి ఫలితాల్ని ఇస్తుంది.

వృశ్చిక రాశి:

ఈవారం మీకు ఆర్థికంగా బాగుంటుంది. స్వర్ణాభరణాలు ధనప్రాప్తి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కాస్త ఆరోగ్యంలో అననుకూలత ఉన్నప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తలతో ద్వారా మీరు దానిని అధిగమించి చేస్తారు. వేరే వాళ్ళు చేసిన తప్పుల వల్ల మీరు మాట పడే పరిస్థితి ఏర్పడుతుంది కాస్త ధైర్యం వహించండి. ఈవారం మీకు 45 శాతం, శుభ పరిణామాలు ఉన్నాయి. విశాఖ నాల్గవ పాదం వారికి మిత్ర తారైంది చాలా అనుకూలంగా వుంది. అనూరాధా నక్షత్ర జాతకులకు మాత్రమే నైధన తారయింది ప్రతికూలతలు చాలా ఎక్కువ జ్యేష్టానక్షత్ర జాతకులకు సాధన తార అయింది అనుకూలతలు ఫలితాలు మంచిగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు.

పరిహారం :- గురువారం నియమాన్ని పాటించడం గురు జపం చేయడము. మేధా దక్షిణామూర్తి స్తోత్రము యోగ సాధన మంచి ఫలితాలను ఇస్తాయి.

ధను రాశి:

ఈ రాశి వారికి ఈ వారం స్థానచలనం ఉంటుంది. అయితే ఆర్థికంగా బాగుంటుంది. ఎన్ని ఉన్నా వీరికి విచారము శత్రువుల పీడ తప్పట్లేదు. అపకీర్తి అనేది మీరు కోరి తెచ్చుకున్నదే. శత్రు వృద్ధి భయాన్ని కలిగిస్తుంది. మీ చేతిలో మీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు. కాస్త జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ భారం 45 శాతం శుభ పరిణామాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది.చాలా మంచి ఫలితాలని పొందబోతున్నారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి విపత్తు తారైంది ప్రతికూలతలు ఎక్కువ గా ఉన్నాయి.

పరిహారం :- మృత్యుంజయ మహా జపం చేయించండి. వీలైతే హోమాదులు జరిపించుకోండి. శని కూడా ఇబ్బంది పెడతాడు కాబట్టి శనికి కూడా దానాదులు చేయండి. మీకు మంచి ఫలితాలుంటాయి.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈ వారం పెద్దగా అనుకూలంగా లేదు. స్థానచలనం వల్ల ధనవ్యయం తో పాటు ఆపదలు కూడా కలుగుతాయి జాగ్రత్త వహించండి. శత్రువులు నీకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అనుకోని విపత్తులు మిమ్మల్ని మానసికంగా డీలా పడేలా చేస్తాయి. చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. అయితే ఈ వారం మీకు ఆర్థికంగా బాగా ఉండటం వలన కాస్తంత ధైర్యం గా ఉండవచ్చు. గురువారం మీకు 36 శాతం మాత్రమే శుభపరిణామాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తు తారైంది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు సంపత్తార అయ్యింది విశేష ధన లాభాన్ని పొందబోతున్నారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి జన్మతార అయింది కుటుంబ అనారోగ్య సూచనలు ఉన్నాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి హోమం చేయించండి అలాగే గురువారం నియమాలు పాటించండి. దత్తాత్రేయ స్తోత్రం గాని మేధా దక్షిణా మూర్తి స్తోత్రం గాని పఠించండి.

కుంభ రాశి:

రాశివారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ సొంత పనే కాదు మీ ద్వారా ఏ పని ప్రారంభించినా ప్రతికూలతలే అవుతాయి. దీంతో మీ గౌరవానికి భంగం కలుగుతుంది. అయినా పర్లేదు ధైర్యం వహించండి ఎందుకంటే ఎక్కువ కాలం కొనసాగదు. ఈవారం మీకు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇది మీకు కొండంత బలం ఇస్తుంది. మీకు ఈ వారం 45 శాతం శుభ పరిణామాలు ఉన్నాయి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది కొద్దిపాటి అనుకూలత ఉంది. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్రతార అయింది కాబట్టి మంచి ఫలితాలని పొందబోతున్నారు.

పరిహారం :- శని ప్రభావం తగ్గడానికి నల్లని నువ్వులు నల్లని వస్త్రము నువ్వులనూనె ఈ మూడు విశేషంగా ఎక్కువ పరిమాణంలో దానం చేయండి. గురుని గూర్చి జపము హోమము లేదా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

మీన రాశి:

ఈ రాశి వారికి ఈ వారం అమోఘంగా అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారం అయ్యేట్లు కనబడుతోంది. చేసిన ప్రతి పని విజయ వంతం అవుతుంది. శత్రువులు ఎంత పెరిగినా గాని మీకు శత్రుజయం.కార్యజయం. ఈ వారంలో మీరు అభివృద్ధితో పాటు ఆనందాన్ని కూడా అనుభవించ బోతున్నారు. ధనవృద్ధి ధాన్య వృద్ధి వంటి సర్వ సంపదలు పొందుతారు. ఈ వారంలో మీకు అత్యధికంగా 63 శాతం శుభ పరిణామాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నాలుగవ పాదం వారికి విపత్తార అయింది ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార అయ్యింది మంచి ఫలితాలు పొందనున్నారు. రేవతి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త వహించమని హెచ్చరికలు ఇస్తున్నది.

పరిహారం :- మంగళవారం నియమాల్ని పాటించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజలు చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. నిరంతరము హనుమత్ ప్రార్థన మీకు శుభ ఫలితాల్ని ఇస్తుంది.


Next Story