వార ఫలాలు : ది.14-2-2021 ఆదివారం నుండి ది. 20-2-2021 శనివారం వరకు

Astrology Of February 3rd Week. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది.

By Medi Samrat  Published on  14 Feb 2021 4:11 AM GMT
Astrology Of February 3rd Week

*ఈ వారం లో గల పర్వ దినములు*

14-2-2021 ఆదివారం నుండి 20-2-2021 శనివారం వరకు గల ముఖ్యమైన పర్వదినములు

1) 14 2 2021 మాఘమాసం ఆదివారం సూర్యనారాయణ స్వామికి చాలా ప్రీతికరమైనది సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

2) 14 -2-2021 ఆదివారం కొన్ని పంచాంగాలలో ప్రకారం ఈరోజు నుంచి శుక్రమూఢం ప్రారంభం.

3) 16-2-2021 మంగళవారం ఈ రోజుకి మదన పంచమి, శ్రీ పంచమి, వసంతోత్సవం, మార్కండేయ జయంతి ఈ విశేష పర్వదినాలు కలిసిన ఈ రోజు కాబట్టి ఈరోజు విద్యార్ధులకు జ్ఞాన ప్రదము. సాధువులకు ఉపయుక్తమో ఈరోజు చాలా మంది విద్యాభ్యాసానికి శ్రీకారం చుడతారు. పద్ధతి ప్రకారము గురు శుక్ర వారాల్లో విద్యాభ్యాసం చేయరాదు.

4) 19-2-2021 శుక్రవారం రథసప్తమి వేడుకలు ఘనంగా సూర్యజయంతి. *కారు పిడకలు* తో అనగా ఆవు వేసిన పేడను యధాతధంగా ఎండబెట్టి వాటిపైన ఇత్తడి గిన్నె లో పాయసం వండి సూర్యనారాయణ స్వామికి నైవేద్యం పెట్టడం హృదయం గా వస్తుంది. భారతదేశం అంతటా అన్ని ప్రాంతాల్లోను సూర్యనారాయణ స్వామి ప్రీతిగా ఈ రకంగా చేయడం వల్ల *O3* *ఓత్రి* వాయువు ఏర్పడుతుంది ఓజోన్ పొరకు రక్షణ కలుగుతుంది.

మేషం రాశి :

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యా రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి,ఉద్యోగాలలో అధికారులఆదరాభిమానాలు పొందుతారు. స్థిరాస్తివృద్ధి కలుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం కలుగుతుంది నూతన కార్యక్రమాలు చేపట్టి ఒక క్రమపద్ధతిలో పూర్తిచేస్తారు సంఘంలోవిశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు విశేషమైన లాభాలు కలుగుతాయి.ప్రయాణాలు అనుకూలిస్తాయి.గృహమున శుభకార్యాలు కలసివస్తాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.

పరిహారం : దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించడం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి.

వృషభం రాశి :

ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పితృ సంభందిత అనుగ్రహంతో పనులు నిర్విఘ్నంగా సాగుతాయి.ధనసహాయంలభిస్తుంది.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలుచేస్తారు.అన్నివైపులనుండి అనుకూలత కలుగుతుంది విద్యావినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమములునిర్వహించి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి. ఖర్చులు అధికమవుతాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.బంధుమిత్రులకు దూరం కావాల్సి రావచ్చు.అధిక శ్రమతో అల్ప లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో అవగాహనా లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి శత్రుసంబంధిత సమస్యలు ఉంటాయి.నూతన వ్యాపారాలు నష్టాల బాట పడతాయి.గృహ నిర్మాణ పనులు మధ్యలో నిలిపివేస్తారు.

పరిహారం: శివాలయం లో.రుద్రాభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి :

ఈ రాశి వారికి అష్టమ స్థాన గ్రహ సంచారం వలన అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. అకారణంగా వివాదాలు ఉంటాయి. శత్రుపరమైన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి .జీవితభాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి సంతానానికి అనారోగ్యసమస్యలు కలుగుతాయి . ఉద్యోగంలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దగ్గరి బంధువులు వియోగం బాధిస్తుంది. వ్యాపారాలు నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి. గృహమున ఆకస్మిక మార్పులు చేస్తారు . ప్రయాణాలలో వాహన ప్రమాదం సూచనలు ఉన్నవి సమయానికి నిద్రాహారాలు ఉండవు.మానసిక సమస్యలు పెరుగుతాయి.ఇతరులతో సమస్యలు పెరుగుతాయి.

పరిహారం : సూర్యారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది.

కర్కాటక రాశి :

ఈ వారంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదుపు చేయడం కష్టమవుతుంది ముఖ్య వ్యవహారాలలో కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సర్దుబాటు ఉండదు. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు చేదు అనుభవాలు మిగులుస్తాయి .బంధు వర్గం వారు నుండి ద్వేషం పెరుగుతుంది అవగాహనా లోపంతో చేపట్టిన వ్యవహారాలలో అడ్డంకులు ఏర్పడతాయి.వృత్తి ఉద్యోగాలలో అలసట అధికమవుతుంది. నూతనవ్యాపారాలకు చేసేప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి.

పరిహారం : శివ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

సింహం రాశి :

ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు అప్రయత్నంగా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగ పరంగా సేవకజన నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి ధనాదాయం బాగుంటుంది.

పరిహారం: గణపతి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి:

ఈ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి బయట పడతారు. దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది.సంతానం విద్యా విషయాలలో అనుకూల ఫలితాలుంటాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు ప్రభుత్వ సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.అన్నిరంగాల వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాలుపొందుతారు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా ప్రవర్తిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

పరిహారం: శ్రీకృష్ణ స్తోత్రం,అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల రాశి:

ఈ రాశివారికి ఈవారం కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరులకు సహాయం సహకారాలు అందిస్తారు.మీమాటకి సంఘంలో విలువ పెరుగుతుంది గృహోపకరణాలుకొనుగోలు చేస్తారు.మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. స్థానచలన సూచనలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి విలువైన వస్తువులను విషయంలో జాగ్రత్త వహించాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామి తరపు బంధువుల వలనఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : నవగ్రహ,శ్రీ రాజ రాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం రాశి :

ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కివస్తాయి దైవసంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దలకు పరిచయాలు లాభిస్తాయి.భూ సంభందిత కార్యవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు ఎదురౌతాయి.

పరిహారం : దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

ధను రాశి:

ఈ వారంలో మీకు ధనాదాయం బాగున్నప్పటికీ సౌకర్యాల విషయంలో లోపం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత జరిమానా కట్టాల్సి రావచ్చు. పనులలో అవగాహన లోపం కలుగుతుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా పెరుగుతుంది ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు. విద్యా రంగం వారికి విశేషమైన రాణింపు కలుగుతుంది.శారీరక మానసిక ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

పరిహారం :

దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి :

ఈ వారం అంతగా అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వివాదాలులో ఇరుక్కొంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఊహించని నష్టాలు ఉంటాయి .ఆర్ధిక సంబంధిత సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి దైవ దర్శనాలు చేసుకుంటారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. నమ్మిన వారే ఇబ్బంది కలిగిస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో చిక్కులు కలుగుతాయి.ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉంటావు.నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలసిరావు. నూతన రుణాలు చేయవలసి రావచ్చు దూర ప్రయాణాలులో శ్రమాధిక్యత పెరుగుతుంది.

పరిహారం : విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి :

ఈ వారం మీకు అంతగా అనుకూలత లేదు వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవనం చాలా కష్టంగా ఉంటుంది.ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురౌతాయి.ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి రుణాలు చేయవలసి రావచ్చు.మనసున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది.చేపట్టిన కార్యాలు మధ్యలో నిలిచిపోతాయి సంతాన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారాల విస్తరణకు చేపట్టిన ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. చెయ్యని పనులకు నిందలు పడవలసిరావచ్చు. నూతన వస్త్ర,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నవి.

పరిహారం : లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలుంటాయి.

మీనరాశి :

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ధనాదాయం బాగుంటుంది . వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతి కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభం కలిగిస్తాయి. మంచి మాట తీరుతో ఇంటాబయటా అందర్నీ ఆకట్టుకుంటారు. భార్య తరఫు బంధువులు సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాలుపొందుతారు. అయితే ఖర్చులు కాస్త పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.రుణ బాధలు అధికమవుతాయి.

పరిహారం: లక్ష్మీ ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.


Next Story