దిన ఫలితాలు : ఆ రాశి వారికి గుడ్‌న్యూస్‌.. మొండి బాకీలు వసూలు అవుతాయట‌..!

మొండి బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు.

By జ్యోత్స్న  Published on  1 April 2024 6:45 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి గుడ్‌న్యూస్‌.. మొండి బాకీలు వసూలు అవుతాయట‌..!

మేషం:

మొండి బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం:

గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మిధునం:

దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం:

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.

సింహం:

రావలసిన ధనం సమయానికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.

కన్య:

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల:

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం:

స్థిరాస్తి వివాదాల లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి.

ధనస్సు:

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.

మకరం:

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.

కుంభం:

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

మీనం:

సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.

Next Story