వాళ్ల పోలికే వచ్చింది.. అందుకే రాజధాని మార్పు..!

By అంజి  Published on  29 Dec 2019 8:44 PM IST
వాళ్ల పోలికే వచ్చింది.. అందుకే రాజధాని మార్పు..!

విజయనగరం: మూడు రాజధానుల అంశంపై మాజీ కేంద్రమంత్రి ఆశోకగజపతి రాజు ఫైర్‌ అయ్యారు. చరిత్రలో మొఘలుల తర్వాత మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ తరచూ రాజధానుల మార్చేవారని.. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి తలెత్తిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అశోకగజపతి రాజు అన్నారు. నాడు అమరావతిలో రాజధాని పెడతామంటే.. ఊ కొట్టిని నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు రోజుకో చోట రాజధాని పెడతానంటూ చెబుతున్నారని మండిపడ్డారు.

33 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏమిటీని గజపతిరాజు ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూసేకరణ చేశారన్నారు. ఎవరు అడిగితే వారికి రాజధాని ఇస్తారా, నెలకో రాజధాని పెట్టమనండి అంటూ మండిపడ్డారు. నాడు ఈ నేతలు అధికారంలో ఉన్నప్పుడే విజయనగరంలో కర్ఫ్యూ వచ్చిందన్నారు. ఇప్పుడు అమరావతిలోనూ అదే పరిస్థితి తలెత్తిందని అశోక్ గజపతిరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావడం లేదన్నారు.

Next Story