• ఏవోబీ వ‌ద్ద 250 మంది పాక్ ఉగ్ర‌వాదులు

ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుందు న‌ర్వానే షాకింగ్ న్యూస్ వినిపించారు. పాకిస్తాన్‌కు చెందిన 250 మంది ఉగ్ర‌వాదులు భార‌త భూభాగంలోకి చొచ్చుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. ఈ ఉగ్ర‌వాదులు ప్ర‌తి రోజు భూభాగంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, భార‌త సైన్యం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని, ఎల్ఓసీ పొడ‌వునా 20 నుంచి 25 లాంచ్ పాడ్స్ ఏర్పాటు చేశార‌ని అన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నామ‌ని పేర్కొన్నారు. బాల‌కోట్‌లో పాక్ ఉగ్ర‌వాద శిబిరాలు ఏర్పాటు అయ్యాయ‌ని, స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర క్యాంపులు, లాంచ్ పాడ్ల లోకేష‌న్ల‌ను మారుస్తున్నార‌న్నారు. ఉగ్ర శిబిరాల‌ను మ‌ద‌ర‌సాల ద్వారానో, ఇత‌ర భారీ సంస్థ‌ల ద్వారానో నిర్వ‌హిస్తున్నార‌నే అభిప్రాయం ఉంద‌న్నారు. వీటిని చిన్న చిన్న గుడిసెల్లో కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం అందింద‌న్నారు. ఇక క‌శ్మీర్ లోయ‌లో మంచు కురుస్తున్నందున పాక్ ఉగ్ర‌వాదులు స‌రిహ‌ద్దుల ద్వారా చొచ్చుకురాలేక‌పోతున్నార‌ని మ‌నోజ్ ముకుంద్ అన్నారు. కొంత‌మంది విదేశీ ఉగ్ర‌వాదులు కూడా ర‌హ‌స్యంగా భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, బాల‌కోట్‌లో కొత్త‌గా ఏర్పాటైన ఉగ్ర శిబిరాల‌పై నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.