కౌంటింగ్ సెంటర్ మీద కాల్పులకు తెగబడదామనుకున్న వ్యక్తి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 1:03 PM GMTపెన్సిల్వేనియా: అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏ ఫలితాలు వస్తాయా అని ఉత్కంఠ కొనసాగుతూ ఉండగా.. ఫిలడెల్ఫియా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. పెన్సిల్వేనియా లోని కన్వెన్షన్ సెంటర్ లో ఓట్ల లెక్కింపు జరుపుతూ ఉండగా ఓ వ్యక్తి తన వాహనంతో కన్వెన్షన్ సెంటర్ లోకి ప్రవేశించాలని చూశాడు.
వెంటనే ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపివేశారు. అతడి దగ్గర ఓ తుపాకీ ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మెయిల్ ఇన్ బ్యాలెట్లను ఆ కన్వెన్షన్ సెంటర్ లో లెక్కిస్తూ ఉండగా ఆ వ్యక్తి లోపలికి చొరబడాలని చూశాడు. ఇంతలో పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంతకూ అతడి ఉద్దేశ్యం ఏమిటి అన్నది తెలియరాలేదు. ఆ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడు.
బైడెన్ కు 264 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ 214 ఓట్లతో కొనసాగుతున్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయింది. మరో ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. అమెరికాలో ఓటు చాలా పవిత్రమైనదని, అంతిమంగా ప్రజల తీర్పే అధ్యక్షుడు ఎవరో నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం ముందు మరే శక్తి పనిచేయదని పేర్కొన్నారు. ప్రతి ఓటు విలువైనదేనని, ప్రతి ఓటు లెక్కించాల్సిందేనని ఆయన చెబుతూ ఉన్నారు.