ట్రంప్‌కు దిమ్మ‌తిరిగే కౌంటర్ ఇచ్చిన ప‌ర్యావ‌ర‌ణం అమ్మాయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 8:02 AM GMT
ట్రంప్‌కు దిమ్మ‌తిరిగే కౌంటర్ ఇచ్చిన ప‌ర్యావ‌ర‌ణం అమ్మాయి

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో ప‌రాజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ డొనాల్డ్‌ ట్రంప్‌కు ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రెటా థన్‌బె‌ర్గ్ సోష‌ల్‌మీడియా వేదిక సెటైర్లు వేసింది. గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్‌కు సోషల్‌మీడియాలో గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్‌‌ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్న‌ ట్రంప్‌పై ఆమె సెటైర్లు వేశారు. ముఖ్యంగా స్టాప్ ది కౌంట్ అంటూ ట్వీట్ చేసిన‌ ట్రంప్‌కు గ్రెటా కౌంట‌ర్ ఇచ్చింది.హాస్యాస్పదంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్‌ యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్‌ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ గ్రెటా ట్వీట్ చేసింది.అంత‌కుముందు పర్యావరణ హితం కోసం విశేష కృషి చేస్తున్న గ్రేటా థన్‌బర్గ్‌ను 2019లో టైమ్ మ్యాగజైన్ ఇయర్‌ ఆఫ్‌ ది పర్సన్ పేరుతో సత్కరించింది. ఈ సందర్బంగా చిల్‌ గ్రెటా అంటూ గ్రెటాను ట్రంప్‌ ఎగతాళి చేశారు. చాలా హాస్యాస్పదం గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్‌పై పని చేయాలి, ఆపై స్నేహితుడితో మంచి పాత ఫ్యాషన్ చిత్రానికి వెళ్లండి అంటూ ట్వీట్‌ చేశారు.

దీంతో ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రంప్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్ననెటిజన్లు గ్రెటా ట్వీట్‌తో మరింత హంగామా చేస్తున్నారు. మాంచి సమయం కోసం వేచి చూసిన గ్రెటా గట్టి కౌంటర్‌ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.

Next Story