కృష్ణా జిల్లాలో ఆపరేషన్ 'ముస్కాన్' కార్యక్రమం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 2:03 PM ISTకృష్ణా జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలను విద్యవైపు మొగ్గు చూపే విధంగా నచ్చజెప్పే కార్యక్రమమే ఆపరేషన్ ముస్కాన్ అని ఎస్పీ రవీంద్రనాథ్ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ అనంతరం పోలీసు గ్రౌండ్స్ నందు పిల్లలను ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్‌లకు అప్పగించే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాల్గొన్నారు. బాలబాలికలు చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యతోనే వీధి పిల్లల భవిష్యత్తు మారుతుందని.. తల్లిదండ్రులు పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలని రవీంద్రనాథ్ బాబు అన్నారు.
తల్లిదండ్రులకు ఇది నచ్చేజెప్పే కార్యక్రమమన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు సంబంధించి మొత్తం 334 వీధి బాలబాలికలను వివిధ ప్రాంతాల్లో గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎస్పీ మోకా సత్తిబాబు, తహశీల్దార్ సునీల్ కుమార్, ఎం.ఈ.వో, ఐసీడీఎస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.