బ్రేకింగ్: ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం..!
By సుభాష్ Published on 19 May 2020 3:38 PM ISTఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో ఏపీలో లాక్‌డౌన్ వల్ల విద్యాసంస్థలకు మూసి ఉన్నాయి. పదో తరగతి పరీక్షలు సైతం వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే ప్రతి ఏడాది మాదిరిగానే జూన్ 12 వరకు వేసవి సెలవులను ప్రకటించింది. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. 1 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు కూడా జూలై 10వ తేదీ నుంచి నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించి టైమ్ టేబుల్ కూడా ఖరారు చేసింది. ఇక తాజాగా ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్ .. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, జులై నెలాఖరులోగా మొదటి విడత చేపట్టిన 15,715 పాఠశాలల్లో నాడు-నేడు కార్యకర్మం కింద పనులు పూర్తి చేయాల్సిం ఉందన్నారు. ఇక 9 రకాల సదుపాయాలను అన్ని పాఠశాలల్లో కల్పించాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన రూ.456 కోట్ల రివాల్వింగ్ నిధులను కూడా విడుదల చేశామని జగన్ తెలిపారు. జులై నె లాఖరు కల్లా అన్ని పాఠశాలల్లో పనులు పూర్తి కావాలని, ఈ పనులపై జిల్లా కలెక్టర్లు ప్రతి రోజు రివ్యూ నిర్వహించాలన్నారు.