ఏపీలో 41 రెడ్ జోన్‌లు.. 45 ఆరెంజ్ జోన్ ప్రాంతాల గుర్తింపు
By సుభాష్ Published on 14 April 2020 5:33 PM ISTఏపీలో కరోనా వైరస్ కాలరాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దేశంలో నేటితో ముగిసిన లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాపించిన తీరును బట్టి మూడు జోన్లుగా విభజించింది ఏపీ ప్రభుత్వం.
41 ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా గుర్తించగా, 45 ఆరెంజ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించింది. మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్‌లలో 86 ప్రాంతాలున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో 43, గ్రామీణ ప్రాంతాల్లో 43 ప్రాంతాలున్నాయి. అలాగే కరోనా ప్రభావం లేని 590 మండలాలను గ్రీన్ జోన్ ప్రాంతాలుగా గుర్తించింది సర్కార్.
ఇక కర్నూలు జిల్లాలో 15 రూరల్ మండలాల్లో కరోనా బాధితులున్నారు. నెల్లూరు జిల్లాలోనూ 13 మండలాలు కరోనా మహమ్మారికి లోనయ్యాయి. గుంటూఊరు, కర్నూలు, నెల్లూరు, వైజాక్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లలోనే 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 123 మంది ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన వారిగా గుర్తించారు అధికారులు. అత్యధికంగా గుంటూరులో 59 కేసులు నమోదయ్యాయి.