ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని నిరుపేదలకు కార్డులు అందించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోద ముద్రవేశారు. ఇక నుంచి రేషన్‌కార్డులు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని,  దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే రేషన్‌ కార్డు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. ఇది ఈనెల 6వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

అంతేకాదు త్వరలోనే రేషన్‌ను డోర్‌ డెలివరీలో భాగంగా కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి 10,15 కిలోల చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందించనుంది. ఒక్కో సంచి తయారీకి రూ. 25 చొప్పున ఖర్చు అవుతుంనది అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు.

కాగా, ఇలా జగన్‌సర్కార్‌ ప్రజలకు మరింత చేరువయ్యే పనులు చేపడుతుండటంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాలన పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు జగన్‌. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరంలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననందు పొందుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.