చంద్రబాబుకు మతిభ్రమించింది: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

By అంజి  Published on  26 Nov 2019 12:19 PM GMT
చంద్రబాబుకు మతిభ్రమించింది: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: ప్రజలు చీకొట్టినా చంద్రబాబు బుద్ది మారలేదన్నారు ప్రభుత్వచీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి. చంద్రబాబుకు మతిభ్రమించిదన్నారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతారని చంద్రబాబు అన్నారని.. అసెంబ్లీలో ఆ మాటలు అన్న మరుసటి రోజే వైఎస్సార్‌ కనుమరుగయ్యారన్నారు. దానిపై విచారణ జరగాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలో చంద్రబాబు లాంటి అవినీతిపరుడు ఎక్కడా కనబడడని.. ఈ విషయాన్ని తెహల్కా ఎప్పుడో చెప్పిందన్నారు. చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే స్టేలు వెకేట్‌ చేయించుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు చంద్రబాబు ఇంగ్లీషుపైన యూటర్న్‌ తీసుకున్నారు. ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దానిని మేం వ్యతిరేకించామని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. మేం ఆరోజు ప్రభుత్వ స్కూల్స్‌ను నారాయణ, చైతన్య సంస్థలకు అప్పజెప్పుతామనే చంద్రబాబు ప్రయత్నాలకు అడ్డుచెప్పామన్నారు. ఇంగ్లీష్ భాషపై మేం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. మాతృభాషపై వ్యాఖ్యలు చేసిన ప్రధానిని కూడా తప్పుపడతారేమో అని చంద్రబాబు అన్నాడని తెలిపారు.

ప్రధాని మోదీ చాలా రాష్ట్రాల ప్రజలతో యుద్ధం చేస్తున్నారని, ఏపీ ప్రజలతో కూడా యుద్ధం చేస్తున్నారని చంద్రబాబు అన్నారని... చంద్రబాబు స్వయంగా ఇలా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకుంటే మంచిదన్నారు. ఇంగ్లీషును చంద్రబాబు వాడిన విధానం చాలా హాస్యాస్పందంగా ఉందన్నారు. ఆంధ్రరాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం మేం ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టామని.. తెలుగును ఎప్పటికి గౌరవించుకుంటామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబే.. ఇప్పుడు ప్రధాని మోదీకి భయపడి పిల్లిలా నోరుమెదపడం లేదన్నారు. గతంలో బాలకృష్ణతో ప్రధాని మోదీని నోటికొచ్చినట్లుగా తిట్టించారని, అమిత్‌ షాపై తిరుపతిలో రాళ్ల దాడి చేయించావని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్‌ కల్యాణ్‌ నడుస్తున్నారన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అన్నారు. కేసీఆర్ తరిమెస్తే చంద్రబాబు భయపడి అమరావతి వచ్చారన్నారు. అధికారులను భయపెట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ వివేకా హత్యపై త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబే ఆంబోతులా వ్యవహారిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Next Story
Share it