సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిందా??

By అంజి  Published on  28 Nov 2019 7:19 AM GMT
సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిందా??

అమరావతి గురించి సోషల్ మీడియాలో లో తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు గాను సింగపూర్ ప్రభుత్వం ప్రతిపక్ష నేత పై అబద్ద ప్రచార చట్టాన్ని మొదటి సారిగా అమలు చేసింది.

పీపల్స్ యాక్షన్ పార్టీ మాజీ నేత, ప్రోగ్రెస్ సింగపూర్ పార్టీ నేత బ్రాడ్ బోయర్, తన వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవంబర్ 13 న ఒక పోస్ట్ పెట్టారు. సింగపూర్ దేశ పెట్టుబడి సంస్థలైన టెమాసక్ హోల్డింగ్స్, గవర్న్ మెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పరేషన్ (జిఐసి) సంస్థల నిర్ణయాలలో ప్రభుత్వం జోక్యం చేస్తోందని, వాటి నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని ఆయన తన పొస్ట్ లో తెలిపారు.

Brad Boyer

దీనిని ఖండిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడమే కాకుండా బోయర్ తన పొస్టును సవరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు బోయర్ తలొగ్గుతూ తన పొస్టును సవరించడమే కాకుండా, ప్రభుత్వం వారు జారీ చేసిన ప్రకటనను దానితో జత పరిచారు.

ఈ ప్రకటన లో సింగపూర్ ప్రభుత్వం బ్రాడ్ బోయర్ చేసిన పొస్ట్ లో అబద్దపు వ్యాఖ్యలు చేశారని ప్రకటించింది. టెమాసక్, జిఐసి సంస్థల నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదని తెలిపింది. ఆ సంస్థలు ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం పూర్తిగా ఆ సంస్థ యాజమాన్యం తీసుకుంటుందని తెలిపింది.

తన పొస్ట్ లో బోయర్, ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతిలో ఈ సంస్థల ద్వారా సింగపూర్ ప్రభుత్వం చేసిన నాలుగు బిలియన్ల డాలర్ల పెట్టుబడి మంచి నిర్ణయం కాదని రాశారు. జిఎల్సీలు, ప్రభుత్వ సంబంధిత పార్టీలు అమరావతిలో డబ్బు గుమ్మరించారని ఆయన ఆరోపించారు.

Broad Boyer

దీనికి, అమరావతి ప్రాజెక్ట్ లో డిజైన్ పరమైన సేవలకు అయిన ఖర్చు కొద్ది మిలియన్ డాలర్లు మాత్రమే అని సింగపూర్ కన్సార్టియం ఇది వరకే ప్రకటించిందని, బిలియన్ల డాలర్లు గుమ్మరించారు అనేది తప్పుడు ప్రచారం అని సింగపూర్ ప్రభుత్వం తన ప్రకటనలో సమాధానం ఇచ్చింది

అంతేకాకుండా, జిఎల్సీలు (GLC), సంబంధిత పార్టీలే కాకుండా ఇతర సింగపూర్ కంపనీలు కూడా అమరావతిలో డబ్బు పెట్టుబడులు చేశారని, అందుకు ఉదాహరణ ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ అని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.

ప్రొటెక్షన్ ఫ్రం ఆన్లైన్ ఫాల్స్ హుడ్స్ అండ్ మనిపులేషన్ యాక్ట్ (POFMA) కింద పొస్ట్ లో ఉన్న తప్పులను సవరించాలని బోయర్ ని సింగపూర్ ప్రభుత్వం కోరింది. ఆయన ఆలగే చేశారు.

ఈ పాఫ్మా యాక్ట్ మే 2019 లో ఆమోదించబడి అక్టోబర్ నుంచీ అమలు లోకి వచ్చింది. మొదటిసారిగా దీనిని బోయర్ పై ప్రయోగించారు.

Next Story