ఏపీలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

By సుభాష్  Published on  6 Jun 2020 6:36 PM IST
ఏపీలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రాంతాల్లో మినహా మిగితా ప్రాంతాల్లో ఈనెల 8వ తేదీ నుంచి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు ప్రారంభం అవుతాయని సీఎం నీలం సాహ్ని వెల్లడించారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభించువచ్చని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, మున్సిపల్‌ కమిషనర్లకు దేశాలు జారీ చేశారు.

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు

► కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల్లకు అనుమతి, ఆహారం పార్శిల్‌ తీసుకెళ్లేందుకు ప్రాధాన్యత

► 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు బయటకు రాకూడదు.

► షాపింగ్‌ మాల్స్‌లో ఎయిర్‌ కండీషనర్‌ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి.

► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం. అలా చేస్తే చర్యలు తప్పనిసరి.

► షాపింగ్‌ మాల్‌ ప్రాంతాల్లో జనాలు గుమిగూడకుండా చూడాలి.

► షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు డిజిటల్‌ చెల్లింపులు, ఈ-వ్యాలెట్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

► హోటళ్లు, రెస్టారెంట్లలో కుర్చీలు, టేబుళ్లు ప్రతీసారి శానిటైజ్‌ చేయాలి.

► ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లలో 50శాతం మందికి మాత్రమే ప్రవేశం.

► గేమింగ్‌ ప్రాంతాల్లో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ మూసే ఉంచాలి.

► షాపింగ్‌ మాల్స్‌లోని సినిమా హాళ్లు మూసే ఉంచాలి.

► హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ లలో శానిటైజర్లు తప్పనిసరి ఉంచాలి. భౌతిక దూరం పాటిస్తూ చర్యలు తీసుకోవాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. (ఇది చదవండి: కరోనాతో అండ‌ర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మృతి..!)

ఆలయాల్లో పాటించాల్సిన మార్గదర్శకాల

► ఆలయాలు, ప్రార్థన మందిరాల ముఖద్వారా వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పకుండా ఉండాలి.

► కరోనా లక్షణాలు లేకుంటేనే ఆలయాల్లోకి అనుమతి ఇవ్వాలి.

► ఆలయాలకు, ప్రార్థన మందిరాలకు వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలి

► లొపల ఉన్నంత సేపు మాస్కులు, ఫేస్‌ కవర్లు తీయరాదు

► మందిరాల వద్ద రద్దీని నియంత్రించాలి, భౌతిక దూరం తప్పనిసరి.

► కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలను వివరించాలి. పోస్టర్లు, స్టాండ్లు, ఆడియో విజువల్స్‌ మీడియా ద్వారా తెలియజేయాలి.

► చెప్పులు, షూస్‌ వాహనం దగ్గరే వదిలి ఆలయాలకు వెళ్లాలి. లేకపోతే వారికి ప్రత్యేక చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేయాలి.

► వరుస క్రమంలో భౌతిక దూరం పాటిస్తూ భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

► భక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.

► లోపలికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వచ్చేందుకు ఒక మార్గం ఏర్పాటు చేయాలి.

► ఆలయాలకు వెళ్లి భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాలకు తాకరాదు.

► ప్రార్థనల సమయంలో ఎవరి మ్యాట్‌ వారే తెచ్చుకోవాలి.

► ప్రసాదాలు, తలపై తీర్థ జలాలు చట్టడం నిషేధం.

► ప్రార్థన మందిరాలకు, ఆలయాలకు వెళ్లే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

► అన్నదానం చేసే సమయంలో సామాజిక దూరం తప్పని సరి.

► ఆలయాలు, ప్రార్థన మందిరాలలో పరిశుభ్రత తప్పని సరి.

► ఏసీలు, వెంటిలేటర్లను సీపీడబ్ల్యూడీ నిబంధనలకు అనుగుణంగానే వినియోగించాల్సి ఉంటుంది

► ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

(ఇది చదవండి: ఏనుగు ఘటన తర్వాత మరో దారుణం: గర్భంతో ఉన్న ఆవు నోట్లో బాంబు పెట్టి..)

(ఇది చదవండి: జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ స్నిగల్‌)

Next Story