జేసీ బ్రదర్స్‌కి షాకిచ్చిన ముఖ్య అనుచరుడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 5:16 PM ISTఅనంతపురం జిల్లా టీడీపీ నేతలకు మరో షాక్ తగిలింది. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో గోరాతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారికి కండువా కప్పి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. జేసీ బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడైన గోరా.. గత కొన్ని రోజులుగా టీడీపీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీలో చేరిన గోరా.. జేసీ బ్రదర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన బస్సులను ఆర్టీఏఈ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
Next Story