వినలేని పరిస్థితిలో మంత్రుల భాష: మాజీ మంత్రి అమర్‌నాథ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 3:12 PM ISTముఖ్యాంశాలు
- రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం
- వరదలు లేని చోట ఎందుకు ఇసుక కొరత ఉంది: అమర్ నాథ్
కడప: బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టం, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకే చంద్రబాబు జిల్లా పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే కొంపలు ముంచే కార్యక్రమాలను వైపీపీ ప్రభుత్వం ప్రారంభించిందని అమర్‌నాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఆదాయం ఎలా వస్తుందని అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశామ్రిక వేత్తలు ఆసక్తి చూపెట్టకపోవడానికి ప్రధాన కారణం.. వైసీపీ ప్రభుత్వ విధానాలేనన్నారు. అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి సీఎం జగన్‌ని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి మండిపడ్డారు. వినలేని పరిస్థితిలో మంత్రుల భాష ఉందన్నారు. వరదలు లేని చోట ఎందుకు ఇసుక కొరత ఉందని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారనడానికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలే కారణమని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అన్నారు.
సంస్థాగతంగా, గ్రామస్థాయిల టీడీపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపి అండగా ఉంటామన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు.