రంగులు తీయాలి.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ముఖ్యాంశాలు

  • పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశం
  • 10 రోజుల్లో మళ్లీ రంగులు వేయాలన్న హైకోర్టు
  • తమ ఆదేశాలను అమలు చేసినట్టు నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం

అమరావతి: రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై వైసీపీ రంగులను తొలగించాలని కీలక తీర్పు వెలువరించింది. 10 రోజుల్లో రంగులు తొలగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలన్న హైకోర్టు.. సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు వెలువరించింది.

ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్లు పూర్తి ఆధారాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ప్రభుత్వ భవనాలపై రంగులు తొలగించాలంటూ గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.