ఏపీలో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు.. కొత్త మార్గదర్శకాలు విడుదల

By సుభాష్  Published on  6 Jun 2020 7:45 AM IST
ఏపీలో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు.. కొత్త మార్గదర్శకాలు విడుదల

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. లాక్‌డౌన్‌ 5.0లో భాగంగా జూన్‌ 8వ తేదీ నుంచి సడలింపులు ఉంటాయని ఇటీవల తెలిపి, నిన్న మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మార్గదర్శకాలకనుగుణంగానే ఏపీ ప్రభుత్వం కూడా నడుచుకోనుంది. 8వ తేదీ నుంచి ఏపీలో ఆలయాలు, ప్రార్థనమందిరాలు, మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యం, కుకుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడదుదల చేసింది. . ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. (ఇది చదవండి: కరోనా: ఏపీలో రెడ్‌ జోన్‌ జిల్లాలు, మండలాలు ఇవే..!)

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు

♦ హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ లలో శానిటైజర్లు తప్పనిసరి ఉంచాలి. భౌతిక దూరం పాటిస్తూ చర్యలు తీసుకోవాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి.

♦ ఆలయాలు, ప్రార్థన మందిరాల ముఖద్వారా వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పకుండా ఉండాలి.

♦ కరోనా లక్షణాలు లేకుంటేనే ఆలయాల్లోకి అనుమతి ఇవ్వాలి.

♦ ఆలయాలకు, ప్రార్థన మందిరాలకు వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలి

♦ లొపల ఉన్నంత సేపు మాస్కులు, ఫేస్‌ కవర్లు తీయరాదు

♦ మందిరాల వద్ద రద్దీని నియంత్రించాలి, భౌతిక దూరం తప్పనిసరి.

♦ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలను వివరించాలి. పోస్టర్లు, స్టాండ్లు, ఆడియో విజువల్స్‌ మీడియా ద్వారా తెలియజేయాలి.

♦ చెప్పులు, షూస్‌ వాహనం దగ్గరే వదిలి ఆలయాలకు వెళ్లాలి. లేకపోతే వారికి ప్రత్యేక చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేయాలి.

♦ వరుస క్రమంలో భౌతిక దూరం పాటిస్తూ భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

♦ భక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.

♦ లోపలికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వచ్చేందుకు ఒక మార్గం ఏర్పాటు చేయాలి.

♦ ఆలయాలకు వెళ్లి భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాలకు తాకరాదు.

♦ ప్రార్థనల సమయంలో ఎవరి మ్యాట్‌ వారే తెచ్చుకోవాలి.

♦ ప్రసాదాలు, తలపై తీర్థ జలాలు చట్టడం నిషేధం.

♦ ప్రార్థన మందిరాలకు, ఆలయాలకు వెళ్లే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

♦ అన్నదానం చేసే సమయంలో సామాజిక దూరం తప్పని సరి.

♦ ఆలయాలు, ప్రార్థన మందిరాలలో పరిశుభ్రత తప్పని సరి.

♦ ఏసీలు, వెంటిలేటర్లను సీపీడబ్ల్యూడీ నిబంధనలకు అనుగుణంగానే వినియోగించాల్సి ఉంటుంది

♦ ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Next Story