ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు
By సుభాష్ Published on 20 July 2020 8:09 PM ISTఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోలపై రూ.1.24, డీజిల్‌పై రూ.0.93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీలో చట్టం 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్‌పై 31శాతం పన్నుతో రూ.4 అదనంగా సుంకాన్ని, అలాగే డీజిల్‌పై 22శాతం వ్యాట్‌తోపాటు రూ.4 అదనంగా సుంకాన్ని విధిస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది.
కాగా, కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి ఆదాయం భారీగా పడిపోవడంతో ఈ వ్యాట్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుమారు రూ.4480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ.. ప్రస్తుతం రూ.1323 కోట్ల మాత్రమే వస్తోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story