మద్యం బాబులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
By సుభాష్ Published on 26 Oct 2020 12:00 PM GMTమద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో మాదిరిగానే మూడు మద్యం బాటిళ్లను తెచ్చుకునేందుకు ఇచ్చిన అనుమతిని నిషేధించింది. పర్మిట్ లేకుండా మద్యం తీసుకువస్తే 1968 ఎక్సైజ్ చట్టం కింద శిక్షార్హులని అబ్కారీ శాఖ తెలిపింది. మద్యం అక్రమ రవాణాతో పాటు ఆదాయం కోల్పోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story