హైద్రాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2020 6:44 AM GMT
ఏపీకి చెందిన అటవీశాఖ అధికారి వి. భాస్కర రమణమూర్తి హైద్రాబాద్ నాగోల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ లోని తన నివాస భవనంలోని అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు నుండి దూకి భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. రమణమూర్తి డిప్రెషన్ తో ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేదా మరే ఇతర కారణం ఏదైనా ఉందో తెలియాల్సివుంది.
ఈ రోజు తెల్లవారు జామున రెండు గంటల సమయంలో నాగోల్ లో రాజీవ్ గృహకల్ప భవన సముదాయంలో ఉన్న తన ఇంటి బాల్కనీలో నుండి కిందకి దూకి చనిపోయాడు. ప్రస్తుతం రమణమూర్తి వయసు 59 సంవత్సరాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే.. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన భాస్కర రమణమూర్తి.. ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read
బ్రేకింగ్: పుణేలో భారీ అగ్నిప్రమాదంNext Story