బ్రేకింగ్‌: పుణేలో భారీ అగ్నిప్రమాదం

By సుభాష్  Published on  1 Oct 2020 4:03 AM GMT
బ్రేకింగ్‌: పుణేలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 10 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో నష్టం గానీ, ప్రాణ నష్టం జరిగిన విషయాలు ఇంకా తెలియరాలేదు.

అయితే ఫైర్‌ సిబ్బంది దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో డ్రమ్స్‌లో ఉన్న కెమికల్స్‌ వల్ల భారీగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. కెమికల్‌ వల్ల మంటలను అదుపులోకి తీసుకురావడం కొంత కష్టమైనట్లు ఫైర్‌ సిబ్బంది తెలిపారు.

కాగా, దేశంలో ఇలాంటి కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీగానే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రమాదాల్లో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా, యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానో ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించి ఈ అగ్ని ప్రమాదానికి కారణమవుతున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలో సరైన సదుపాయాలు లేక కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో హడావుడి చేయడం తప్ప తర్వాత మర్చిపోతున్నారు.



Next Story