ఇంగ్లీష్ మీడియంపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
By సుభాష్ Published on 21 May 2020 5:39 PM ISTఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్‌మీడియాం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఓ ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఓ ఆంగ్ల ఛానెల్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే జూన్ నెలాఖరు వరకూ వీటిని పూర్తి చేసి జులైలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు అభ్యంతరాలను కొత్తగా ఆదేశాలు ఇవ్వాలన్న భావనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రెండు జీవోలు తీసుకురాగా, వాటిని హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియం చదువుకోవాలన్నది తల్లిదండ్రులు, విద్యార్థులే నిర్ణయించుకుంటారని న్యాయస్థానం తెలిపింది. వారి అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.
అందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 96.17శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించడంతో పాటు తమ అంగీకారాన్ని ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియంపై ఈనెల 13న ఏపీ ప్రభుత్వం మరో జీవో్ను జారీ చేసింది. దాని ప్రకారమే 2020-21 గాను 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది.
కాగా, మైనార్టీ భాష కలిగిన పాఠశాలలు యధావితథంగా అమలు కానుంది. దీంతో ప్రతియేటా క్రమక్రమంగా 7 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంగా మారనున్నాయి.