ఏపీలో 2452 కరోనా కేసులు

By సుభాష్  Published on  21 May 2020 6:37 AM GMT
ఏపీలో 2452 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా.. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాగాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 8,092 మందికి పరీక్షలు నిర్వహించగా, 45 మందికి కరోనా తేలింది. ఇక 41 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 2452 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 1680 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ 54 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 718 మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మొదట్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదు కాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వస్తోంది.Next Story
Share it