ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాసంస్థలకు సంచలన ఆదేశాలు
By సుభాష్ Published on 23 April 2020 7:58 PM ISTఏపీలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజలు వసూలు చేయవద్దని సూచించింది. అడ్మిషన్ సమయంలో ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు గత ఏడాది ఫీజుల ఆధారంగానే మొదటి త్రైమాసిక ఫీజులు వసూలు చేయాలని, అది కూడా ఒక్కసారే కాకుండా విడతల వారిగా వసూలు చేయాలని తెలిపింది.
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూల చేయవద్దని స్కూట్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ కాంతారావు ఈ ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.