విజయనగరం: ఒరే బావ చూడరా ఇదే నా చివరి సెల్ఫీ అంటూ డిసెంబర్ 31 రాత్రి ఓ యువకుడు టిక్ టాక్ చేసాడు. తెల్లవారితే చనిపోయాడు. ఎవరైనా తదాస్తు అన్నారేమే. 31 రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సరదాగా చేసిన టిక్ టాక్ వీడియో నిజమైనది. విజయనగరం జిల్లా బొందపల్లి మండలం ఎం. కొత్తవలసకు చెందిన వినోద్ మంగళవారం రాత్రి కొత్త సంవత్స వేడుకల్లో భాగంగా ఇద్దరు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. ఇదే సమయంలో ఒరే బావ ఇదే నా చివరి సెల్ఫీ అని టిచ్ టాక్ చేశాడు.

తరువాత మిత్రులతో కలిసి బైక్ పై త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బొందపల్లి మండలం ఎడ్ల పాలెం వద్ద బైక్‌ అదుపు తప్పి తాడి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్‌ పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందడాడు, బైక్ పై ఉన్న వినోద్‌ మిత్రులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది. టిక్‌టాక్‌ వీడియోలో యువకుడు చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినోద్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.